దారుణం: శివాలయంలో ఇద్దరు సాధువుల దారుణ హత్య

By సుభాష్  Published on  28 April 2020 6:44 AM GMT
దారుణం: శివాలయంలో ఇద్దరు సాధువుల దారుణ హత్య

దేశంలో హత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఒక వైపు కరోనాపై పోరాటం చేస్తుంటే మరో వైపు శివాలయంలో ఇద్దరు సాధువుల హత్యలు కలకలం రేపుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఇద్దరు సాధువులు అనుమానస్పదంగా మృతి చెందారు. మొన్న పాల్‌ఘర్‌లో ఇద్దరు సాధువులతో పాటు కారు డ్రైవర్‌ హత్య మరువకముందే మరో ఇద్దరు సాధువులు హత్యకు గురికావడం సంచలనంగా మారింది.

మంగళవారం తెల్లవారుజామునల బులంద్‌షహర్‌లోని ఓ శివాలయంలో ఇద్దరు సాధువులను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. రక్తపు మడుగులో పడివున్న మృతదేహాలను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హత్యకు గురైన సాధువులు జగదీష్‌ (55), షేర్‌ సింగ్‌ (45)గా గర్తించారు. వీరిద్దరు కూడా శివాలయంలో పురోహతులుగా పని చేస్తున్నారు. పదునైన ఆయుధాలు ఉపయోగించి హత్య చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఈ హత్యలకు సంబంధించి ప్రధాని నిందితుడిగా అనుమానిస్తున్న సమీప గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

అయితే రెండు, మూడు రోజుల క్రితం రాజు సాధువులతో గొడవ పడినట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం మత్తుమందు ఇచ్చి పదునైన ఆయుధాలతో హత్య చేసినట్లు పోలీసు అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ స్పందించారు. ఈ హత్యలపై లోతైన విచారణ చేపట్టి నిందితులను పట్టుకోవాలని పోలీసులను ఆదేశించారు.

Next Story
Share it