తెలంగాణలో కొత్తగా 1,949 కరోనా కేసులు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Oct 2020 5:05 AM GMT
తెలంగాణలో కొత్తగా 1,949 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,949 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 10 మంది మృతి చెందారు. అలాగే 2,366 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,99,276 కేసులు నమోదు కాగా, 1163 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 1,70,212గా ఉంది.

ఇక రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతం ఉండగా, దేశంలో 1.6 శాతం ఉంది. అలాగే రాష్ట్రలో కోలుకున్నవారి రేటు 85.41 శాతం ఉండగా, దేశంలో 84.1 శాతం ఉంది. మొత్తం యాక్టివ్‌ కేసులు 27,901 ఉండగా, ఐసోలేషన్‌లో 22,816 మంది చికిత్స పొందుతున్నట్లు తెలంగాణ రాష్ట వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇక గడిచిన 24గంటల్లో అత్యధికంగా పాజిటివ్‌ కేసులు.. జీహెచ్‌ఎంసీలో 291, కరీంనగర్‌ 114, మేడ్చల్‌ మల్కాజిగిరి 150, నల్గొండ 124, రంగారెడ్డి 156 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Next Story