ఏపీలో కొత్తగా 6,224 పాజిటివ్ కేసులు
By సుభాష్ Published on 3 Oct 2020 6:10 PM ISTఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 72,861 కరోనా పరీక్షలు నిర్వహించగా, అందులో 6,224 మందికి పాజిటివ్ తేలినట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే కరోనాతో కృష్ణా జిల్లాలో ఆరుగురు, చిత్తూరులో ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఐదుగురు, గుంటూరులో నలుగురు, ప్రకాశంలో నలుగురు, విశాఖలో నలుగురు, నెల్లూరులో ముగ్గురు, అనంతపూర్‌లో ఇద్దరు, కడపలో ఇద్దరు, కర్నూలులో ఇద్దరు, శ్రీకాకుళంలో ఇద్దరు, విజయనగరంలో ఒక్కరు, పశ్చిమ గోదావరిలో ఒక్కరు చొప్పున 41 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 7,798 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో మృతుల సంఖ్య 5941 మందికి చేరింది.
Next Story