తెలంగాణ‌లో కొత్త‌గా ఎన్ని కేసులు న‌మోద‌య్యాయంటే..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Oct 2020 3:32 AM GMT
తెలంగాణ‌లో కొత్త‌గా ఎన్ని కేసులు న‌మోద‌య్యాయంటే..

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,717 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,12,063 చేరుకుంది. ఇక కొత్తగా 5గురు మృతి చెందగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో మృతుల సంఖ్య 1222కు చేరింది. ఇక రాష్ట్రంలో మరణాల రేటు 0.57 శాతం ఉండగా, అదే దేశంలో 1.5 శాతం ఉన్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే రాష్ట్రంలో కోలుకున్నవారి రేటు 87.29 శాతం ఉండగా, దేశంలో 85.9 శాతం ఉన్నట్లు తెలిపింది. ఇక రాష్ట్రంలో యాక్టివ్‌ కేసులు 25,713 ఉండగా, హోంఐసోలేషన్‌లో ఉన్న వ్య‌క్తుల సంఖ్య‌ 21,209 ఉంది.

ఇక కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసులలో అత్య‌ధికంగా.. జీహెచ్‌ఎంసీ ప‌రిధిలో 276, కరీంనగర్ 104, మేడ్చల్‌ మల్కాజిగిరి 131, నల్గొండ 101, రంగారెడ్డి 132 చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇక మిగతా జిల్లాల్లో వందలోపు కేసులు నమోదయ్యాయి.

Next Story