తెలంగాణలో కొత్తగా 1610 పాజిటివ్ కేసులు
By తోట వంశీ కుమార్ Published on 28 July 2020 9:11 AM ISTతెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. నిన్న(సోమవారం 27న) 57,142 శాంపిల్స్‌ను పరీక్షించగా.. కొత్తగా మరో 1610 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 9 మంది మృత్యువాత పడినట్లు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 57,142కి చేరింది. ఈ మహమ్మారి బారీన పడి మొత్తం 480 మంది మరణించారు.తాజాగా 803 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో.. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 42,909కి చేరింది. 13,753 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఏ జిల్లాలో ఎన్ని కేసులు అంటే..
ఆదిలాబాద్ – 13
భద్రాద్రి కొత్తగూడెం-16
జీహెచ్ఎంసీ -531
జగిత్యాల-12
జనగాం-18
జయశంకర్ భూపాలపల్లి –20
జోగులాంబ గద్వాల -34
కామారెడ్డి -18
కరీంనగర్ -48
ఖమ్మం -26
ఆసిఫాబాద్ -0
మహబూబ్ నగర్ -23
మహబూబాబాద్ -14
మంచిర్యాల- 13
మెదక్ – 12
మేడ్చల్ మల్కాజ్గిరి – 113
ములుగు – 32
నాగర్‌కర్నూల్ – 9
నల్లగొండ – 26
నారాయణపేట -14
నిర్మల్ -0
నిజామాబాద్ - 58
పెద్దపల్లి -48
రాజన్న సిరిసిల్ల -14
రంగారెడ్డి -172
సంగారెడ్డి -74
సిద్దిపేట – 14
సూర్యాపేట-35
వికారాబాద్-11
వనపర్తి – 3
వరంగల్ రూరల్ -25
వరంగల్ అర్భన్ -152
యాదాద్రి భువనగిరి -12