తెలంగాణలో గడిచిన 24 గంటల్లో ఎన్ని కేసులంటే..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Oct 2020 3:15 AM GMT
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో ఎన్ని కేసులంటే..

తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,504 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తగా ఐదుగురు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా (2,35,656 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, మొత్తం కరోనాతో 1324 మంది మృతి చెందారు.

తాజాగా 1,436 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ కాగా, మొత్తం ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 2,16,353 ఉంది. ఇక మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 17,979 ఉండగా, హోం ఐసోలేషన్‌లో 14,938 మంది చికిత్స పొందుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

అలాగే రాష్ట్రంలో మరణాల రేటు 0.56 శాతం ఉండగా, అదే దేశంలో 1.5శాతం ఉంది. రాష్ట్రంలో కోలుకున్నవారి రేటు 91.80 శాతం ఉండగా, అదే దేశంలో 90.9 శాతం ఉంది. ఇక కొత్తగా జీహెచ్‌ఎంసీలో 288 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, మేడ్చల్‌ మల్కాజిగిరి 118, రంగారెడ్డి 115 చొప్పున నమోదయ్యాయి. ఇక మిగతా జిల్లాల్లో పదుల సంఖ్యలో నమోదయ్యాయి.

Next Story