1473 Corona cases in Telangana | తెలంగాణలో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. గడిచిన 24 గంటల్లో 9,817 సాంపిల్స్‌ను పరీక్షించగా.. కొత్తగా 1,473 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 8 మంది మృత్యువాత పడినట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 55,532కి చేరింది. ఈ మహమ్మారి బారీన పడి మొత్తం 471 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఏ జిల్లాలో ఎన్ని కేసులు అంటే..

ఆదిలాబాద్‌ – 28
భద్రాద్రి కొత్తగూడెం-10
జీహెచ్‌ఎంసీ -506
జగిత్యాల-18
జనగాం-10
జయశంకర్‌ భూపాలపల్లి – 10
జోగులాంబ గద్వాల -32
కామారెడ్డి -17
కరీంనగర్‌ -91
ఖమ్మం -20
ఆసిఫాబాద్‌ -0
మహబూబ్‌ నగర్‌ -8
మహబూబాబాద్‌ -34
మంచిర్యాల- 14
మెదక్‌ – 17
మేడ్చల్‌ మల్కాజ్‌గిరి – 86
ములుగు – 12
నాగర్‌కర్నూల్‌ – 19
నల్లగొండ – 28
నారాయణపేట -2
నిర్మల్‌ -0
నిజామాబాద్‌ -41
పెద్దపల్లి -0
రాజన్న సిరిసిల్ల -19
రంగారెడ్డి -168
సంగారెడ్డి -98
సిద్దిపేట – 12
సూర్యాపేట-32
వికారాబాద్‌-2
వనపర్తి – 9
వరంగల్‌ రూరల్‌ -8
వరంగల్‌ అర్భన్‌ -111

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.