రాష్ట్రంలో 16 ఇంజనీరింగ్ కళాశాలలు మూత..!

By సుభాష్  Published on  25 July 2020 3:09 AM GMT
రాష్ట్రంలో 16 ఇంజనీరింగ్ కళాశాలలు మూత..!

తెలంగాణ రాష్ట్రంలో 16 ఇంజనీరింగ్‌ కళాశాలలు మూతపడనున్నాయి. దీంతో వాటిలో ఉన్న 4వేల సీట్లు రద్దు కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 201 ఇంజనీరింగ్‌ కళాశాలలకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అనుమతి ఇవ్వగా, మరో 16 కళాశాలలు మూసివేతకు దరఖాస్తు చేసుకున్నాయి. ఆయా కాలేజీల్లోని దాదాపు 4వేల సీట్లలో మొదటి సంవత్సరం ప్రవేశాలు వద్దని జేఎన్‌టీయూకు దరఖాస్తు చేశాయి. గత నాలుగు సంవత్సరాలుగా పెద్దగా ప్రవేశాలు లేకపోవడం, గత సంవత్సరం అన్నీ బ్రాంచీల్లో కలిపి 70 లోపే ప్రవేశాలు ఉండటం, అంతకు ముందు సంవత్సరాల్లోనూ పరిస్థితి అలాగే ఉండటంతో ఆ కళాశాలలన్నీ మూసివేతకు దరఖాస్తు చేసుకున్నాయి.

దీంతో ఈ విద్యా సంవత్సరం ఆయా కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే అవకాశం లేదు. మరో వైపు వరుసగా మూడేళ్లు 30శాతం కంటే తక్కువ ప్రవేశాలు ఉంటే సీట్లకే అనుమతి ఇస్తామని ఏఐసీటీఈ గతంలోనే స్పష్టం చేసింది. ఇక రాష్ట్ర యూనివర్సిటీలు మాత్రం 25 శాతం కంటే తక్కువ సీట్లు భర్తీ అయ్యే కళాశాలల్లో ప్రవేశాలకు అనుమతించమని తెలిపింది.

Next Story