అమెరికాలోని సెంట్రల్‌ పనామా జైలులో ఖైదీల మధ్య జరిగిన తగాదం 14 మంది మరణానికి దారి తీసింది. ఒకే గ్రూపుకు చెందిన ఖైదీల మధ్య తలెత్తిన ఘర్షణలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. లాజొయితా జైలు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం….. ఖైదీలు గ్రూప్ లుగా విడిపోయి తమ సహచర ఖైదీలపై దాడులకు పాల్పడ్డారు. అనంతరం తుపాకులతో ఎదురుకాల్పులకు దిగారు. అయితే, ఖైదీల దగ్గర 5 తుపాకులు, మూడు ఏకే-47 రైఫిల్స్‌ దొరకడం చర్చనీయాంశం అయ్యింది. రెండు వారాల క్రితమే జైల్లో సోదాలు జరిగినప్పుడు కొన్ని తుపాకులు లభించాలని వాటిని స్వాధీనం చేసుకున్నప్పటికీ, ఇప్పుడు ఈ విధంగా జరగడం ఆందోళన కలిగిస్తోందంటున్నారు పనామా ప్రెసిడెంట్ కార్టిజో. అసలు ఇవి ఏవిధంగా వచ్చాయనే అంశంపై విచారణ జరుపుతున్నామని తెలిపారు.

 

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.