రాజస్తాన్‌లోని నేషనల్‌ హైవే 11పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కును అతివేగంతో ట్రావెల్‌ బస్సు ఢీకొట్టింది. బికనీర్‌ నుంచి ఈ ఘటనలో 14 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 30 మందికి తీవ్రగాయాలు కాగా.. స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. బికనీర్‌ నుంచి ప్రయాణికులతో వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి పోలీసులు చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎదురుగా వస్తున్న ట్రక్కును బస్సు అతివేగంగా ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.

 Road Accident

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.