ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపాయి భారత భద్రతా బలగాలు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులపై భారత సైన్యం ఉక్కుపాదం మోపింది. పూంచ్‌ జిల్లాలో ఉగ్రవాదుల చొరబాట్లను భారత ఆర్మీ తిప్పికొట్టింది. ఉగ్రవాదులు చొరబడ్డారన్న ఇంటలిజెన్స్‌ వర్గాల సమాచారంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. పూంచ్‌ జిల్లాలో గాలింపు చర్యలు చేపట్టాయి. దీంతో గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వారి కాల్పులను భారత ఆర్మీ తిప్పికొట్టింది. వారిపై ఎదురు కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో 13 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

కాగా, పాకిస్థాన్‌లో శిక్షణ పొందుతున్న ఉగ్రవాదులు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ సరిహద్దుల నుంచి చొరబడేందుకు ప్రయత్నించగా, ఆర్మీ జవాన్లు కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే. నౌషేరా సెక్టార్‌లో సరిహద్దులు దాటి చొరబడేందుకు యత్నిస్తుండగా, వారి ప్రయత్నాలను ఆర్మీ జవాన్‌లు తిప్పికొ్ట్టారు. గమనించిన ఉగ్రవాదుకు సైన్యంపై కాల్పులకు దిగగా, వారి కాల్పును తిప్పికొట్టాయి బలగాలు.

దీంతో ఉగ్రవాదులు మరికొంత మంది నక్కిఉన్నారన్న సమాచారంలో సైన్యం ఆపరేషన్‌ చేపట్టింది. ఇక తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో 13 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే ఈ వేసవి కాలంలో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలు భారీగా పెరిగాయని, వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టి ముష్కరులను మట్టుబెడుతున్నట్లు భద్రతా బలగాలు పేర్కొన్నాయి.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.