కరోనా ఇప్పుడు ప్ర‌పంచాన్ని వణికిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఏకంగా 151 దేశాలకు పాకింది. ఈ వైర‌స్ బారిన‌ప‌డి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 5,821 మంది చెందారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న లెక్క‌ల ప్ర‌కారం లక్షా 56 వేల 433 మంది బాధితులు ఉన్నారు.ఇదిలావుంటే.. భారత్ లోనూ కరోనా విస్తరిస్తోంది.

ఇప్ప‌టివ‌ర‌కూ మ‌న‌ దేశంలో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. 100 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ నేఫ‌థ్యంలో కరోనాను జాతీయ విపత్తుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే కరోనా బాధితులను ఆదుకోవాలని కూడా కేంద్రం నిర్ణయించింది. ధీని కార‌ణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.

ఇదిలావుంటే.. కరోనా వైరస్‌ రోజు రోజుకు విజృంభిస్తుండడంతో కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ నెల 31 వరకు విద్యాసంస్థలు బంద్ చేశారు. స్కూళ్లు, కాలేజీలు, మాల్స్, థియేటర్లు, పబ్ లు, మాల్స్, స్విమ్మింగ్ పూల్స్ మూసివేశారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.