10 ఏళ్ల బాలిక జూమ్ క్లాస్ లో ఉండగా.. ఆమె తల్లికి జరిగిన దారుణం ఏమిటంటే..!
By న్యూస్‌మీటర్ తెలుగు
10 సంవత్సరాల బాలిక అప్పుడే జూమ్ క్లాస్ లోకి జాయిన్ అయింది. ఆ సమయంలో ఆ బాలిక వెనుక చోటుచేసుకున్న ఘటన చూసి టీచర్ కూడా షాక్ అయ్యింది. వార్ ఫీల్డ్ ఎలిమెంటరీ స్కూల్ కు చెందిన టీచర్ మంగళవారం నాడు ఇండియానా టౌన్ లో చోటుచేసుకున్న దారుణాన్ని జూమ్ క్లాస్ ద్వారా చూసింది. ఆన్‌లైన్ క్లాసులో లాగిన్ అవుతున్న ఇతర విద్యార్థులు భయపడకుండా ఉండేందుకు బాలికను టీచర్ మ్యూట్ చేశారు. ఆ బాలిక భయంతో చెవులు మూసుకోడాన్ని చూసింది. భారీ శబ్ధాలు వినిపించడం ఆ బాలిక తన చెవులపై చేతులు వేసుకోవడం గమనించగా అంతలోనే స్క్రీన్ డార్క్ అయిపోయింది.
ఇంతకూ అక్కడ చోటు చేసుకున్న దారుణం ఏమిటో తెలుసా..? జూమ్ క్లాస్ ప్రారంభం కాగానే బాలిక తల్లి మర్బియల్ రొసాడో మోరేల్స్ (32) ను ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్ డొనాల్డ్ జే విలియమ్స్ (27) కాల్చి చంపాడు. పోలీసుల కథనం ప్రకారం.. మోరేల్స్ ఆసుపత్రిలో కన్ను మూసింది. గంట తర్వాత ఈ దారుణానికి పాల్పడిన జే విలియమ్స్ ను అదుపులోకి తీసుకున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా జూమ్ ద్వారా క్లాసులు వింటూ ఉన్నారు. 10 ఏళ్ల బాలిక కూడా క్లాస్ వినాలని అనుకుంది. ఈ దారుణం చోటుచేసుకున్న సమయంలో ఆ ఇంట్లో అయిదుగురు పిల్లలు ఉన్నారని.. వారంతా ఈ దారుణాన్ని చూసారని పోలీసులు తెలిపారు.
మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. మోరేల్స్ ఇంట్లోకి చొరబడిన విలియమ్స్ ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన ఓ వీడియోపై ఆమెను ప్రశ్నించాడని, ఆమె నవ్వుతూ బదులిస్తుండగా ఆగ్రహంతో విలియమ్స్ ఆమెపై కాల్పులు జరిపాడని సిండర్ తెలిపారు. 2015లో విలియమ్స్ తాను దొంగిలించిన తుపాకీతో ఈ దారుణానికి పాల్పడ్డాడు.
ఈ ఘటన జరిగిన సమయంలో ఏదో ఆ 10 ఏళ్ల బాలిక కంప్యూటర్ కు తగిలింది. మోరేల్స్ ముగ్గురు పిల్లలతో పాటూ, ఇద్దరు కజిన్స్ కూడా అక్కడే ఉన్నారు. పిల్లల వయసు 10 నుండి 17 సంవత్సరాలు ఉందని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే ఒకరు 911కు కాల్ చేశారు. లాన్ వుడ్ మెడికల్ సెంటర్ ఇన్ ఫోర్ట్ పీర్స్ కు మోరేల్స్ ను తీసుకుని వెళ్లగా ఆమె చనిపోయిందంటూ ధృవీకరించారు.
విలియమ్స్ కాల్చిన తర్వాత తన సైకిల్ మీద పారిపోయాడు. ఆ తర్వాత బస్ ఎక్కాలని ప్రయత్నించగా బస్సు డ్రైవర్ కు అనుమానం రావడంతో 911 కు కాల్ చేశాడు. అక్కడే ట్రైనింగ్ తీసుకుంటున్న స్వాట్ టీమ్ వచ్చి అతడిని పట్టుకుంది. అతడి బ్యాగ్ లో గన్ ను స్వాధీనం చేసుకున్నారు.
మోరేల్స్, విలియమ్స్ విడిపోయి సంవత్సరం పైనే అవుతోంది. డొమెస్టిక్ వయొలెన్స్ కేసు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. జూమ్ కాల్ లో ఉన్న టీచర్ పేరును పోలీసులు వెల్లడించలేదు. చిన్నారి తల్లి మరణానికి స్కూల్ శ్రద్ధాంజలిని ఘటించింది.