కృనాల్‌కు కోసం హార్థిక్ జీరో క్యాల‌రీ కేక్‌.. గ‌మ‌త్తుఏంటంటే..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 March 2020 2:09 PM GMT
కృనాల్‌కు కోసం హార్థిక్ జీరో క్యాల‌రీ కేక్‌.. గ‌మ‌త్తుఏంటంటే..?

క‌రోనా వైర‌స్‌(కొవిడ్‌-19) కార‌ణంగా ప‌లు క్రీడా టోర్నీలు వాయిదా ప‌డ‌గా.. మ‌రికొన్ని ర‌ద్దు అయ్యాయి. దీంతో క్రీడాకారులంతా కుటుంబ స‌భ్యుల‌తో హాయిగా గ‌డుపుతున్నారు. ఇక ఐపీఎల్ వాయిదా ప‌డ‌డంతో టీమ్ఇండియా క్రికెట‌ర్లు క‌రోనా సెల‌వుల‌ను బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. టీమ్ఇండియా క్రికెట‌ర్ కృనాల్ పాండ్య పుట్టిన రోజు సంద‌ర్భంగా సోద‌రుడు టీమ్ఇండియా ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్య జీరో కాల‌రీ కేక్ తినిపించాడు. అందుకు సంబంధించిన ఫోటోను అభిమానుల‌తో పంచుకున్నాడు హార్థిక్ పాండ్య. కృనాల్ పాండ్యాకు బ‌ర్త్‌డే విష్ చెబుతూ చేసిన ఓపోస్టు అభిమానుల‌ను తెగఆక‌ట్టుకుంది.

హ్యాపీ బ‌ర్త్‌డే భాయ్‌. గృహ నిర్భందంలో మ‌న‌మిద్ద‌రం క‌లిసున్నాం. ఇదిగో నీకోసం జీరో క్యాల‌రీ ఇన్విజిబుల్ కేక్ గిఫ్ట్‌గా ఇస్తున్నా అంటూ ఓ ఫోటోను పోస్టు చేశాడు. ఆ ఫోటోలో హార్ధిక్ త‌న సోద‌రుడికి కేక్ తినిపిస్తున్న‌ట్లు క‌నిపించేలా ఉన్నా.. అత‌డి చేతిలో నిజంగా కేక్ లేదు. కేక్ లేదు కాబ‌ట్టేగా దానిని ఇన్విజిబుల్ కేక్ అని అన్నాడు ఈ ఆల్‌రౌండ‌ర్‌.

దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించ‌డంతో ప్ర‌జ‌లంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. పాండ్య బ్ర‌ద‌ర్స్ కూడా ఇంటి వ‌ద్ద‌నే ఉన్నారు. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌) కోసం వీరిద్ద‌రు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఐపీఎల్ మ‌రింత ఆల‌స్య‌మ‌య్యే అవ‌కాశం ఉంది.

Next Story
Share it