ఒవైసీ ఎందుకు 'జెడ్' అక్షరం తొలగించొద్దన్నారు??
By సత్య ప్రియ Published on 4 Nov 2019 6:03 AM GMTఆర్టీసీ ప్రైవటీకరణ పై అసదుద్దిన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్య మంత్రి కేసీఆర్ ఇచ్చిన ప్రదిపాదనలను ఒప్పుకొని విధులలో చేరవల్సిందిగా ఆర్టీసి ఉద్యోగులను అభ్యర్దించారు.
ఆర్టీసి ప్రైవెటీకరిస్తే తమకు అభ్యంతరం లేదనీ, అయితే, ప్రైవెటీకరణ జరిగిన తరువాత కూడా బస్సుల నంబర్ ప్లేట్లలోని ‘జెడ్ ' అక్షరం తొలగించవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తల్లి జెహ్రా పేరు నుంచి ఆర్టీసీ నంబర్ ప్లేట్లలో జెడ్ అనే అక్షరం వచ్చిందని గుర్తు చేశారు. ఇది హైదరాబాద్ చరిత్ర లో భాగమని అన్నారు. బస్సులో జెడ్ అక్షరాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.
Next Story