ఆ ముగ్గురికే టీ20ల్లో కూడా డ‌బుల్ సెంచ‌రీ చేసే స‌త్తా వుంది

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Feb 2020 3:15 PM GMT
ఆ ముగ్గురికే టీ20ల్లో కూడా డ‌బుల్ సెంచ‌రీ చేసే స‌త్తా వుంది

ఇంట‌ర్నేష‌న‌ల్ టీ20 క్రికెట్‌లో టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్ ఓ ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తి అనే చెప్పుకోవాలి. ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు కొట్టడం.. 12 బంతుల్లో అర్థ‌ సెంచరీ సాధించడం.. ఇటువంటి ఎన్నో ఘనతలు సాధించాడు. అందుకే అత‌నికి యూత్‌లో చాలా క్రేజ్‌. ఎన్నో రికార్డులు సాధించిన యువీ.. టీ20ల్లో కూడా డబుల్‌ సెంచరీ సాధ్యం అంటున్నాడు.

యువరాజ్‌ మాట్లాడుతూ..‘ పొట్టి పార్మ‌ట్‌లో డబుల్‌ సెంచరీ అంటే చాలా కష్టమే.. అలా అనీ.. అది అసాధ్యం కూడా కాదు. ప్ర‌స్తుత క్రికెట్ ఆట‌తీరును చూస్తే సాధ్యం కానిది ఏదీ లేదనిపిస్తుంది. టీ20ల్లో డబుల్‌ సెంచరీ కొట్టే అవకాశం నా దృష్టిలో ముగ్గురు క్రికెట్ల‌కు ఉందని నమ్ముతున్నా. క్రిస్‌ గేల్‌, ఏబీ డివిలియర్స్‌, రోహిత్‌ శర్మలకు టీ20ల్లో కూడా డ‌బుల్ సెంచ‌రీ సాధించే సత్తా ఉంది’ అని యువీ అన్నాడు.

ఇదిలావుంటే.. అంతర్జాతీయ టీ20ల్లో రోహిత్‌ ఇప్పటివరకూ నాలుగు సెంచ‌రీలు చేయ‌గా.. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, కొలిన్‌ మున్రోలు చెరో మూడు సెంచరీలు సాధించారు. అలాగే.. ఇంట‌ర్నేష‌న‌ల్ టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు ఆసీస్ కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ పేరిట ఉండ‌గా.. అఫ్గాన్‌కు చెందిన హజ్రుతుల్లా జజాయ్‌ 162 పరుగుల వ్యక్తిగత స్కోరుతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక‌ ఓవరాల్‌గా టీ20ల్లో అత్యధిక స్కోరు క్రిస్‌ గేల్‌ పేరిట ఉంది. ఐపీఎల్‌లో 2013లో ఆర్సీబీ తరఫున ఆడిన‌ గేల్ పూణే వారియ‌ర్స్‌పై అజేయంగా 175 పరుగులు సాధించాడు.

Next Story