ఈ నెల 15న 'వైఎస్సార్‌ రైతు భరోసా' పథకం ప్రారంభం..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Oct 2019 6:53 AM GMT
ఈ నెల 15న వైఎస్సార్‌ రైతు భరోసా పథకం ప్రారంభం..

అమరావతి: సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలుపరుస్తున్నారు. ఈ నెల 15న వైఎస్సార్‌ రైతు భరోసా కార్యక్రమాన్నిసీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు. నెల్లూరు సమీపంలోని కాకుటూరులో ఈ పథకాన్ని వైఎస్‌ జగన్‌ ప్రారంభింస్తారు. 15వ తేదీన ఉదయం 10.30 గంటలకు విక్రమసింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణానికి సీఎం జగన్‌ చేరుకోనున్నారు. ఆ తర్వాత కౌలు రైతులకు కార్డులను పంపిణీ చేయనున్నారు. అనంతరం రైతులకు వైఎస్సార్‌ రైతుభరోసా చెక్కులను సీఎం వైఎస్‌ జగన్‌ పంపిణీ చేయనున్నారు. ఆ తర్వాత జరిగే బహిరంగసభలో జగన్‌ ప్రసంగించనున్నారు. రైతు భరోసా పథకంకు అర్హులైన రైతులకు ఏడాదికి రూ.12,500లను ప్రభుత్వం అందించనుంది.

Next Story