స్మార్ట్ టీవీల పంపిణీ.. జగన్ సర్కార్ సంచలన నిర్ణయం
By సుభాష్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఎన్నో సంచలన పథకాలను అమలు చేస్తూ పాలన కొనసాగిస్తుంటే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం జగనన్న దీవెన పథకం విషయంలో అధికారులతో జగన్ సమీక్ష నిర్వహించారు. జగనన్నదీవెన పథకంలో భాగంగా పాఠశాల విద్యార్థులకు అందించే కిట్ విషయంలో ఆయన అధికారులు చర్చలు జరిపారు. బ్యాగులో మూడు జతల యూనిఫామ్స్, షూస్, స్నాక్స్, బెల్ట్‌తోపాటు పుస్తకాలు అందించాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా అవన్నీ కూడా నాణ్యమైనవి అందించాలని ఆదేశించారు.
అలాగే పాఠశాలలను డిజిటలైజ్ చేసే విషయం ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. విద్యార్థులకు డిజిటల్ విధానంలో బోధనలు చేసేందుకు ప్రతి ప్రభుత్వ పాఠశాలకు ఒక స్మార్ట్ టీవీని అందించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అన్ని పాఠశాలల్లో స్మార్ట్ టీవీలను అందజేయాలని జగన్ అధికారులను ఆదేశించారు.