అమిత్‌షా నుంచి జగన్‌కు ఫోన్.. రేపు ఢిల్లీకి జగన్..!
By సుభాష్ Published on 28 Dec 2019 9:37 PM ISTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఈ మేరకు అమిత్ షా నుంచి ఫోన్ రావడంతోనే జగన్ ఢిల్లీకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. విశాఖ ఉత్సవ్ లో పాల్గొన్న సీఎం జగన్ అమిత్ షా నుంచి పిలుపు రావడంతో హడావుడిగా విజయవాడ చేరుకున్నారు. అక్కడ అమిత్ షాతో భేటీ ఉంటుందని తెలుస్తోంది. సడన్ గా అమిత్ షా నుంచి ఫోన్ రావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఇంత సడన్ గా ఫోన్ రావడం వెనుక ఏమై ఉంటుందని నేతలు చర్చించుకుంటున్నారు.
Next Story