అశ్లీల ఫొటోలతో పెట్టుబడి.. అడ్డంగా బుక్కైన యువకుడు

By అంజి  Published on  14 March 2020 8:05 AM GMT
అశ్లీల ఫొటోలతో పెట్టుబడి.. అడ్డంగా బుక్కైన యువకుడు

హైదరాబాద్‌: నేటి సమాజంలో డబ్బులు సంపాదించేందుకు యువత అడ్డదారులు తొక్కుతోంది. లైఫ్‌ను ఎంజాయ్‌ చేసేందుకు, పబ్బులో గడపడానికి, జల్సాలు చేసేందుకు అక్రమ మార్గాలను ఎంచుకుంటున్నారు. తర్వాత పోలీసులకు దొరికి అడ్డంగా బొక్క బోర్ల పడుతున్నారు. అందుకు ఈ సంఘటనే నిదర్శనం. డేటింగ్‌యాప్‌లో యువతుల ఫొటోలు పెట్టి.. అడిగిన వారికి సెక్స్‌ ఫొటోలను పంపుతూ డబ్బు సంపాదిస్తున్న యువకుడిని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

విజయవాడలో ఛార్టెట్‌ అకౌంటెంట్‌ కోర్సు చదువుతున్న వెన్నెల వెంకటేష్‌ స్వస్థలం విజయనగరం. ఇతనికి అమ్మాయిల ఫొటోలు అన్నా, నీలి చిత్రాలన్న తెగ పిచ్చి. టిండర్‌ యాప్‌లో అమ్మాయిల ఫొటోలు పెట్టి.. వచ్చిన డబ్బులతో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వచ్చి పబ్బుల్లో గడిపి వెళ్లేవాడు. తాజాగా టిండర్‌ డేటింగ్‌ యాప్‌లో తన ఫొటోలను ఎవరో పోస్టు చేశారంటూ ఓ యువతి బంజారాహిల్స్‌ పోలీసులను ఆశ్రయించడంతో ఈ యువకుడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వెంకటేష్‌.. ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్స్‌ ఉన్న యువతల ఫొటోలను డౌన్‌లోడ్‌ చేసి వాటిని టిండర్‌ డేటింగ్‌ యాప్‌లో పోస్టు చేసేవాడు.

ఆ ఫొటోలతో పాటు ఇంట్రెస్ట్‌ ఉన్న వారు తనను సంప్రదించాలని కింద తన నెంబర్‌ను ఉంచేవాడు. ఈ విధంగా తనకు కాల్‌ చేసిన వారి నుంచి తగినంత నగదు.. తన అకౌంట్‌లో జమ చేయాలని చెప్పేవాడు. ఆ తర్వాత యువకులకు నీలి చిత్రాలు, సెక్స్‌ ఫొటోలు, రొమాన్స్‌ ఆడియోలు పంపిచేవాడు. ఇలా రోజుకు కనీసం సుమారు రూ.5 నుంచి రూ.6 వేల వరకు డబ్బులు సంపాదించేవాడు. వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తూ.. ఆన్‌లైన్‌లో రమ్మీ గేమ్‌లు ఆడేవాడని పోలీసులు తెలిపారు.

ఇలా యువతుల ఫొటోలను డౌన్‌లోడ్‌ చేసుకొని అక్రమ మార్గంలో చాలా మంది డబ్బులు సంపాదిస్తున్నారని తెలిసింది. చెడు అలవాట్లకు బానిసలు అయ్యి యువత.. అడ్డదారులు తొక్కుతున్నారు.

Next Story
Share it