ప్రస్తుతం చిన్న చిన్న విషయాలకు తమ జీవితాలను అర్ధాంతరంగా ముగిస్తున్నారు కొందరు. వరంగల్‌కు చెందిన ఓ యువకుడు తనకు బట్టతల వస్తోందని, తనను ఎవరు పెళ్లి చేసుకోరు అని తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. గదిలో ఎవరు లేని సమయం చూసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువకుడు ఆత్మహత్యకు పాల్పడం అతని కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.

వివరాల్లోకి వెళ్లితే..

వరంగల్‌ అర్భన్‌ జిల్లాకు చెందిన నితిన్‌ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి ఉప్పల్‌లో నివసిస్తూ క్యాటరింగ్‌ పనులు చేస్తుండేవాడు. తాను సంపాదించిన డబ్బులో కొంత తల్లిదండ్రులకు పంపుతుండేవాడు. అయితే.. అతడికి జుట్టురాలిపోతుండేది. దీంతో హెయిర్‌ ట్రాన్స్ ప్లాంటేషన్‌ చేయించుకోవడం కోసం కొంత నగదును దాచుకోవడం మొదలుపెట్టాడు. అయితే.. లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయాడు. కాగా.. సోదరి పెళ్లికి డబ్బు పంపాలని ఇంటి నుంచి సమాచారం వచ్చింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైయ్యాడు. తన స్నేహితులు లేని సమయంలో గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని, పెళ్లి కాకముందే జుట్టురాలిపోతోందని ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు అందులో పేర్కొన్నాడు. ఈ ఘటన ఈ నెల 25న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తోట‌ వంశీ కుమార్‌

Next Story