యువ హీరో నాగశౌర్య 'అశ్వథ్థామ' టైటిల్ పోస్టర్ విడుదల

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Oct 2019 5:20 AM GMT
యువ హీరో నాగశౌర్య అశ్వథ్థామ టైటిల్ పోస్టర్ విడుదల

యువ‌ హీరో నాగ శౌర్య‌, బ‌బ్లీ బ్యూటీ మెహ‌రిన్ జంట‌గా ఐరా క్రియేష‌న్స్ ప‌తాకం పై శంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో ఉషా ముల్పూరి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా ద్వారా ర‌మ‌ణ తేజ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. . అటు క్లాస్ ఇటు మాస్ ఆడియెన్స్‌ని అల‌రించేలా ఈ సినిమాని రూపొందిస్తున్న‌ట్టు చిత్ర యూనిట్ తెలియ‌చేసారు. ఈ మూవీ టైటిల్ అశ్వథ్థామ‌. దీపావ‌ళి సంద‌ర్భంగా అశ్వథ్థామ టైటిల్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాత‌ ఉషా ముల్పూరి మాట్లాడుతూ… ఐరా క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ నెం.3 టైటిల్ ఎనౌన్స్‌మెంట్ కోసం పండ‌గ‌రోజు ఛ‌లో సెంటిమెంట్‌తో మిమ్మ‌ల్ని అంద‌ర్నీ క‌లవ‌డం జ‌రిగింది. నాగ‌శౌర్య‌, మెహ్రీన్ జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి 'అశ్వథ్థామ' అనే టైటిల్‌ని ఖ‌రారు చేసాం. టాకీ పార్ట్ మొత్తం పూర్త‌యింది. ఈ చిత్రానికి ర‌మ‌ణ‌తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. యు.ఎస్‌.లో కొన్ని ఇంగ్లీష్ మూవీస్‌కి వ‌ర్క్ చేశారు. ఛ‌లో చిత్రం నుంచి శౌర్య‌తో క‌లిసి ట్రావెల్ చేశాడు. క‌థని నాగ‌శౌర్య‌ రెడీ చేసాకా వీరిద్ద‌రు క‌లిసి ఈ చిత్రానికి వ‌ర్క్ చేశారు.

డి.ఒ.పి.మ‌నోజ్‌రెడ్డి కూడా యు.ఎస్‌.లో వ‌ర్క్ చేశారు. త‌ను కూడా ఒక సంవ‌త్స‌రం నుంచి మాతో క‌లిసి ప‌ని చేస్తున్నారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ శ్రీ‌చ‌ర‌ణ్‌పాకాల, ఎడిట‌ర్ గ్యారీ గ‌తంలో క్ష‌ణం, గూఢాచారి, ఎవ‌రు చిత్రాల‌కు ప‌ని చేశారు. మేమంద‌రం క‌లిసి ఒక టీమ్ వ‌ర్క్‌లా ప‌ని చేసి మంచి అవుట్‌ను మీ ముందుకు తీసుకువ‌స్తున్నాం. కె.జి.ఎఫ్ చిత్రానికి స్టంట్స్‌ చేసిన అన్‌భైర‌వ్ మాస్ట‌ర్స్ ఈ చిత్రానికి ప‌ని చేశారు. మూవీకి సంబంధించి యాక్ష‌న్ పార్ట్ కూడా ఉంటుంది. ఒక్క పాట మిన‌హా షూట్ మొత్తం పూర్త‌యింది. ఫిబ్ర‌వ‌రిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామన్నారు.

డైరెక్ట‌ర్ ర‌మ‌ణ‌తేజ మాట్లాడుతూ… ఈ చిత్రం ఒక యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌. శౌర్య ఒక రియ‌ల్ ఇన్సిడెంట్స్ తీసుకుని దాని ఆధారంగా క‌థ‌ను రాసుకున్నారు. నేను ఆయ‌న‌తో క‌లిసి 'ఛ‌లో' చిత్రం నుంచి ట్రావెల్ చేస్తున్నాను. ఆయ‌న ఈ క‌థ‌కు న‌న్ను ద‌ర్శ‌కుడుగా అనుకున్నందుకు నాకు చాలా గ‌ర్వంగా ఉంది. నా ఫ‌స్ట్ మూవీ ఇంత మంచి మూవీ రావ‌డం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఐరా క్రియేష‌న్స్ ఒన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ‌క్ష‌న్ కంపెనీ స్టాండ‌ర్డ్స్‌కి ఎక్క‌డా త‌క్కువ లేకుండా నేనేమ‌డిగినా నాకు అన్నీ ఇచ్చారు. ప్రొడ‌క్ష‌న్‌లో నాకు ఎప్పుడూ ఏ ఇబ్బంది రాలేదు.

Next Story
Share it