చిత్తూరు: స్థానిక ఎన్నికల వేళ.. టీడీపీకి భారీ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే టీడీపీ నుంచి చాలా మంది నేతలు.. వైసీపీలో చేరారు. చాలా చోట్ల అధికార పార్టీ ఏకగ్రీవాలు జరుగుతున్నాయి. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలో కూడా ఇదే జరిగింది. చంద్రగిరి నియోజకవర్గంలో 95 ఎంపీటీసీ స్థానాలకు గాను ఏకంగా 76 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అన్ని స్థానాలు కూడా వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. మిగిలిన 19 స్థానాలు కూడా అటు ఇటుగా ఉన్నాయని సమాచారం.

గత సాధారణ ఎన్నికల సమయంలో చంద్రగిరి నియోజకవర్గంలో చాలా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. వైసీపీ, టీడీపీ కార్యకర్తలు దెబ్బాలడుకున్న విషయం తెలిసిందే. టీడీపీ ఫిర్యాదుతో అక్కడ రీ పోలింగ్‌ జరిగింది. ఇప్పుడు స్థానిక ఎన్నికల సమయంలో కూడా మళ్లీ గొడవలు జరుగుతాయోమనని స్థానికులు భయపడుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి గోడవలు జరగలేదని తెలుస్తోంది. వైసీపీ ఏకగ్రీవం పొందిన 75 ఎంపీటీసీ స్థానాల్లో ఎక్కడా కూడా గొడవలు జరగలేదని సమాచారం. టీడీపీ నుంచి సరైన పోటీ లేకపోవడంతోనే ఈ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కాగా టీడీపీ నేతలు ఎన్నికల పోటీ నుంచి ఎందుకు తప్పుకున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఇక చంద్రబాబు సొంతూరు నారావారిపల్లెలో కూడా ప్రజలు వైసీపీకి అనుకూలంగా ఉన్నారని సమాచారం. రాష్ట్రంలో మొదటిసారిగా అధికారంలోకి వచ్చిన వైసీపీ.. పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఈ పథకాలు కూడా గ్రామ వాలంటీర్ల ద్వారా మెజార్టీ ప్రజల వద్దకు చేరుకుంటున్నాయి. అందుకే ప్రజలు వైసీపీని సపోర్ట్‌ చేస్తున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పథకాల అమలులో చిన్న చిన్న తప్పులున్న.. ప్రజలు సంతోషంగానే ఉన్నారు. టీడీపీ పార్టీకి చెందిన కార్యకర్తలు, వారి కుటుంబాలు, సానుభూతిపరులకు కూడా ప్రభుత్వ పథకాలు అందుతున్నాయట. అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే.. రాష్ట్రాన్ని సీఎం జగన్‌ అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నారని, అందకే ప్రజలు వైసీపీ పక్షాన నిలబడుతున్నారని పలువురు అంటున్నారు.

అధికార దుర్వినియోగంతో చంద్రగిరి మండలంలో వైసీపీ తన ఆధిపత్యాన్ని చెలాయించేందుకు ప్రయత్నిస్తోందని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అయితే తాము ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఒకవేళ తాము అడ్డుకుంటే.. మిగిలిన 19 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఎలా పోటీలో ఉంటారని వైసీపీ నేతలు అంటున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతుండడంతో టీడీపీకి ఎం చేయాలో తోచని పరిస్థితి నెలకొంది. చంద్రగిరిలో వైసీపీని ఏకగ్రీవంగా చేసేందుకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి స్పెషల్‌ ఫోకస్‌ పెట్టాడు. వీలైనంతవరకు జనాల్లోనే తిరుగుతున్నాడు. ఎవరికి ఏ అవసరం వచ్చిన.. అక్కడ వాలిపోయే చెవిరెడ్డికి జనాల్లో కూడా మంచి ఆదరణ ఉంది. ఇక చివరకు ఎం జరుగుతుందో చూడాలీ మరీ.!

అంజి

Next Story