కూలిన పెళ్లి వేదిక.. ఎమ్మెల్యే ఆర్కేకు గాయం

By Newsmeter.Network  Published on  29 Feb 2020 10:35 AM GMT
కూలిన పెళ్లి వేదిక.. ఎమ్మెల్యే ఆర్కేకు గాయం

గుంటూరు జిల్లాలో ఓ వివాహా వేడుకకు హాజరైన వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) గాయపడ్డారు. తాడేపల్లి మండలం ఉండవల్లిలో శుక్రవారం రాత్రి నూతన వధూవరులను ఆశీర్వదించేందుకు ఎమ్మెల్యే స్టేజీపైకి ఎక్కారు. ఈ సమయంలో ఎమ్మెల్యేతో కరచాలనం కోసం స్థానికులు కూడా వేదికపైకి చేరుకున్నారు. వేదికపై బరువు పెరగడంతో ఒక్కసారిగా వేదిక కూలిపోయింది.

కాగా.. ఈ ఘటనలో ఎమ్మెల్యే ఆర్కేతో సహా ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు. ఎమ్మెల్యే కుడికాలి పాదానికి గాయం అవడంతో ఆయన్ను గుంటూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.

YCP MLA Alla Ramakrishna Reddy Injured

Next Story
Share it