యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి ప్రసాదంలో బొద్దింక..!

By Newsmeter.Network  Published on  8 Dec 2019 4:47 PM IST
యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి ప్రసాదంలో బొద్దింక..!

యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో లడ్డూ ప్రసాదంలో బొద్దింక కనిపించింది. ఆలయ దర్శనం కోసం వచ్చిన ఓ భక్తుడు కొనుగోలు చేసిన లడ్డూను తింటుండగా, అందులో చనిపోయిన బొద్దింక దర్శనమిచ్చింది. వెంటనే ఆ భక్తుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. లడ్డూలో బొద్దింక గురించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని భక్తులు ఆరోపిస్తున్నారు. ప్రసాదంలో బొద్దింక రావడంతో ఆలయ అధికారులపై భక్తులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. భక్తుల ఆగ్రహానికి స్పందిచిన ఆలయ అధికారులు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పి భక్తులను శాంతింపజేసినట్లు తెలుస్తోంది.

ఇటీవల ఈ ఆలయంల వివాదాల్లో చిక్కుకుంటోంది. చినజీయర్ స్వామి ఆగమ పర్యవేక్షణలో పునర్నిర్మాణం చేపడుతున్నప్పటికీ.. ఆర్కిటెక్టులు,శిల్పులు వారి అనుమతి లేకుండానే స్వయంభువు విగ్రహంలో మార్పులు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. శిలపై వెలసినట్టుగా ఉండే నరసింహాస్వామి మూలవిరాట్టు విగ్రహాన్ని తాకడమే కాకుండా.. విగ్రహ ఆకారంలో మార్పు చేశారన్న చర్చ సాగుతోంది. గతంలో స్వామి తలపై ఉండే ఏడు తలల ఆదిశేషుడికి బదులు ఇప్పుడు ఐదు తలల ఆదిశేషుడిని పునర్నిర్మించినట్టు తెలుస్తోంది. గతంలో మూలవిరాట్టు విగ్రహం శాంతమూర్తిగా దర్శనమివ్వగా.. ఇప్పుడది ఉగ్రరూపంలో కనిపిస్తున్నట్టు తెలుస్తోంది.

Next Story