ప్రపంచంలోనే అతిపెద్ద కోవిద్-19 కేర్ సెంటర్ ను ఏర్పాటు చేసిన భారత్

By Medi Samrat  Published on  5 July 2020 10:15 AM GMT
ప్రపంచంలోనే అతిపెద్ద కోవిద్-19 కేర్ సెంటర్ ను ఏర్పాటు చేసిన భారత్

న్యూ ఢిల్లీ : ప్రపంచంలోనే అతిపెద్ద కోవిద్-19 కేర్ సెంటర్ ను భారత్ ఏర్పాటు చేసింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ 10000 బెడ్స్ ఉన్న సర్దార్ పటేల్ కోవిద్ కేర్ సెంటర్ ను ప్రారంభించారు. రాధా సోమి సత్సంగ్ బీస్ లో ఆదివారం నాడు ఈ కోవిద్-19 కేర్ సెంటర్ ను అందుబాటులోకి తీసుకుని వచ్చారు. బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు, ఐసీయులు అందుబాటులోకి తీసుకుని వచ్చినట్లు తెలిపారు. ఈ సెంటర్ ను అత్యంత వేగంగా పూర్తీ చేసినందుకు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులను అనిల్ అభినందించారు.

యూనియన్ మినిస్టర్ అమిత్ షా మార్గదర్శకంలో ప్రపంచంలోనే అతి పెద్ద కోవిద్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేశామని, కరోనా వైరస్ తో పోరాడడంలో ఈ సెంటర్ ఎంతో బాగా ఉపయోగపడుతుందని అనిల్ అన్నారు. అత్యంత విషమంగా ఉన్న రోగులను చాలా జాగ్రత్తగా చూసుకోవాలని.. వీలైనంత వెంటనే ఆసుపత్రులకు తీసుకుని వెళ్లాలని కోరారు. ఈ కోవిద్ సెంటర్ లో ఎప్పటికప్పుడు శానిటైజేషన్ నిర్వహిస్తూ ఉండాలని.. రోగులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని కోరారు.

ఈ సెంటర్ 1700 అడుగుల పొడవు, 700 అడుగుల వెడల్పు ఉంది. 200 ఫుట్ బాల్ మైదానాలతో సమానం. 200 ఎన్క్లోజర్లు.. ఒక్కో దాంట్లో 50 బెడ్లు ఏర్పాటు చేశారు. 10200 పేషెంట్లకు ఈ సెంటర్ లో చికిత్స అందించవచ్చని అధికారులు తెలిపారు. 1000 మందికి పైగా డాక్టర్లు, నర్సులు, ఐటిబిపి పారామెడికల్ స్టాఫ్ ను ఈ సెంటర్ లో సేవలు అందించడానికి ఉంచారు. ఈ వెహికల్స్, అంబులెన్స్ లను కూడా తగినన్ని అధికారులు ఏర్పాటు చేశారు. సెంటర్ సెక్యూరిటీ కోసం క్విక్ రియాక్షన్ టీమ్ ను ఉంచారు.

Next Story