స‌చిన్ పేరిట ఉన్న భారీ రికార్డును బద్దలు కొట్టిన కోహ్లీ

2023 వన్డే ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటి వరకూ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విరాట్ రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు.

By Medi Samrat  Published on  12 Oct 2023 10:50 AM GMT
స‌చిన్ పేరిట ఉన్న భారీ రికార్డును బద్దలు కొట్టిన కోహ్లీ

2023 వన్డే ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటి వరకూ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విరాట్ రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. తొలి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాపై 85 పరుగులు చేయ‌గా.. రెండో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై 55 పరుగులు చేశాడు. విరాట్ 55 పరుగుల ఇన్నింగ్స్ అతనికి చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే ఈ ఇన్నింగ్స్ తర్వాత విరాట్ పేరిట చాలా ప్రత్యేకమైన రికార్డు నమోద‌య్యింది. సచిన్ టెండూల్కర్‌ను దాటి విరాట్ కోహ్లి ఇప్పుడు ఓ ప్రత్యేకతను సాధించాడు.

ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 55 పరుగుల ఇన్నింగ్స్ ఆడిన త‌ర్వాత‌.. ఐసీసీ టోర్నీల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ విషయంలో టీమిండియా మాజీ వెటరన్ ప్లేయర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను విరాట్ వెనక్కి నెట్టాడు. ODI ప్రపంచ కప్, T20 ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ.. ఈ మూడు టోర్నీలలో అత్యధిక పరుగులు చేసిన ఆట‌గాడిగా కోహ్లీ నిలిచాడు. విరాట్ కోహ్లీ- 2311 (52 ఇన్నింగ్సులు), సచిన్ టెండూల్కర్- 2278 (44 ఇన్నింగ్సులు), కుమార సంగక్కర- 2193 (65 ఇన్నింగ్స్‌లు) తొలి మూడు స్థానాల్లో ఉన్నాడు.

విరాట్ కోహ్లీ ప్ర‌స్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై జట్టు ప్రారంభంలో 3 వికెట్లు కోల్పోయిన తర్వాత విరాట్ టీమ్ ఇండియాను కష్టాల నుండి బయటపడేయడమే కాకుండా అద్భుతమైన విజయానికి బాట‌లు వేశాడు. దీంతో రాబోయే పాక్ మ్యాచ్‌లోనూ విరాట్‌ నుంచి ఇలాంటి గొప్ప ఆటతీరును జట్టుతో పాటు అభిమానులు ఆశిస్తున్నారు.

Next Story