గిల్ అవుట్ అవ్వకున్నా.. పెవిలియన్ కు ఎందుకు వెళ్లాడంటే.?

ముంబైలో జరుగుతున్న భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో

By Medi Samrat  Published on  15 Nov 2023 10:48 AM GMT
గిల్ అవుట్ అవ్వకున్నా.. పెవిలియన్ కు ఎందుకు వెళ్లాడంటే.?

ముంబైలో జరుగుతున్న భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ పెవిలియన్ కు చేరడం షాకింగ్ గా నిలిచింది. గిల్ రిటైర్ట్ హార్ట్‌గా పెవిలియన్ చేరాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకి రోహిత్ శర్మ మెరుపు ఆరంభం అందించాడు. 29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 47 పరుగులు చేసిన రోహిత్ శర్మ భారీ షాట్ ఆడే ప్రయత్నంలో పెవిలియన్ చేరాడు.

రోహిత్ అవుట్ అయ్యాక శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ కలిసి రెండో వికెట్‌కి 93 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. శుబ్‌మన్ గిల్ వేగంగా ఆడుతుంటే మరో ఎండ్‌లో విరాట్ కోహ్లీ నెమ్మదిగా ఆడుతూ స్ట్రైయిక్ రొటేట్ చేశాడు. 65 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 79 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్ తొడ కండరాలు పట్టేయడంతో పెవిలియన్‌ చేరాడు. ఇక ఈ మ్యాచ్ లో సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ.. వరల్డ్ కప్‌లో 50 సిక్సర్లు కొట్టిన మొట్టమొదటి బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు అందుకున్నాడు.

Next Story