ప్రస్తుతం జరుగుతున్న ICC ప్రపంచ కప్ 2023లో భారత బ్యాటర్ శుభ్‌మన్ గిల్ మంచి ప్రదర్శన చేస్తున్నాడు. అతడు ఇప్పుడు ప్రపంచ నంబర్ 1 ODI బ్యాటర్‌గా నిలిచాడు. బాబర్ అజామ్ ఇన్ని రోజులు నంబర్ 1 స్థానంలో ఉండగా.. ఇప్పుడు గిల్ ఆ స్థానంలోకి వచ్చాడు. ICC పురుషుల ODI బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మెన్ ఇన్ బ్లూ ఓపెనర్ పాకిస్థాన్ కెప్టెన్ ను పక్కకు నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. సచిన్ టెండూల్కర్, MS ధోనీ, విరాట్ కోహ్లీ తర్వాత నంబర్ 1 ర్యాంకింగ్ లో నిలిచిన భారత బ్యాటర్ గా గిల్ నిలిచాడు.
తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో.. గిల్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌లో 6 ఇన్నింగ్స్‌ల్లో రెండు అర్ధసెంచరీల సాయంతో 219 పరుగులు చేసిన గిల్.. బాబర్ కంటే ఆరు రేటింగ్ పాయింట్లు (830) అధికంగా సాధించి, ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తొలిసారి అగ్రపీఠాన్ని అధిరోహించాడు. వరల్డ్‌కప్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ నాలుగో స్థానానికి ఎగబాకాడు. రోహిత్ శర్మ ఆరో స్థానంలో ఉన్నాడు.బౌలింగ్ విషయానికొస్తే టాప్-10లో ఏకంగా నలుగురు భారత బౌలర్లు చోటు దక్కించుకున్నారు. మొహమ్మద్ సిరాజ్ నంబర్ 1 గా ఉండగా.. కుల్దీప్ యాదవ్ నాలుగు, బుమ్రా తొమ్మిది, షమీ పదో స్థానంలో నిలిచారు.