భారత్ సెమీస్ ప్రత్యర్థి న్యూజిలాండ్

కోల్‌కతాలో ఇంగ్లండ్‌తో జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్‌లో పాకిస్తాన్ తమ NRRని మెరుగుపరచడంలో విఫలమవడంతో..

By Medi Samrat  Published on  11 Nov 2023 8:30 PM IST
భారత్ సెమీస్ ప్రత్యర్థి న్యూజిలాండ్

కోల్‌కతాలో ఇంగ్లండ్‌తో జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్‌లో పాకిస్తాన్ తమ NRRని మెరుగుపరచడంలో విఫలమవడంతో.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, భారత్, దక్షిణాఫ్రికా జట్లు సెమీస్ కు చేరాయి. అద్భుతం జరిగితే కానీ పాకిస్థాన్ జట్టు సెమీస్ కు చేరే అవకాశం లేదని ముందుగానే ఫిక్స్ అవ్వగా.. ఇంగ్లండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోగానే పాక్ సెమీస్ అవకాశాలు మాయమైపోయాయి.

భారత్ గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచింది. నవంబర్ 15, బుధవారం సెమీ-ఫైనల్ 1లో న్యూజిలాండ్‌తో వాంఖడే స్టేడియంలో ఆడుతుంది. గ్రూప్ దశల్లో రెండో స్థానంలో నిలిచిన దక్షిణాఫ్రికా, మూడో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాతో ఈడెన్ గార్డెన్స్‌లో నవంబర్ 16న గురువారం రెండో సెమీ ఫైనల్‌లో ఆడుతుంది. వన్డే ప్రపంచకప్ చరిత్రలో సెమీ ఫైనల్స్‌లో ఇదే తొలి రిపీట్ సెట్. 2015 ప్రపంచ కప్‌లో భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు సెమీస్ ఆడాయి.

సెమీ-ఫైనల్స్:

నవంబర్ 15: భారత్ vs న్యూజిలాండ్, ముంబైలోని వాంఖడే స్టేడియంలో సెమీ-ఫైనల్ 1

నవంబర్ 16: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికా vs ఆస్ట్రేలియా.. సెమీ-ఫైనల్ 2

Next Story