వాళ్ల ఇష్టం.. ఇకపై 'డీఆర్‌ఎస్' తీసుకోను : రోహిత్
ప్రపంచకప్‌లో భారత్ అద్భుత ప్రదర్శన చేస్తోంది. భారత్ వరుసగా 7 విజయాలతో సెమీస్‌లోకి ప్రవేశించింది.
By Medi Samrat Published on 3 Nov 2023 4:36 PM ISTప్రపంచకప్‌లో భారత్ అద్భుత ప్రదర్శన చేస్తోంది. భారత్ వరుసగా 7 విజయాలతో సెమీస్‌లోకి ప్రవేశించింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ డీఆర్‌ఎస్‌ని ఉపయోగించడం జట్టుకు చాలా ప్రయోజనకరంగా మారింది. అయినప్పటికీ మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ డీఆర్‌ఎస్‌పై పెద్ద ప్రకటన చేశాడు.
శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు బౌలింగ్ చేస్తున్నప్పుడు శ్రీలంక బ్యాట్స్‌మెన్ ఒకరు ఔటైనా ఎవరూ పెద్దగా అప్పీల్ చేయలేదు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ సహా బౌలర్లు నాటౌట్ అని భావించారు. ఆ తర్వాత వికెట్ వెనుక నుంచి వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ రోహిత్ శర్మకు బ్యాట్స్‌మెన్ ఔట్, డీఆర్‌ఎస్ తీసుకుందాం అని చెప్పాడు. రాహుల్ పట్టుబట్టడంతో చివరి క్షణంలో రోహిత్ డీఆర్ఎస్ తీసుకున్నాడు. థర్డ్ అంపైర్ నిర్ణయం బ్యాట్స్‌మెన్ ఔట్ అని వచ్చింది. డీఆర్‌ఎస్ తీసుకోవాలన్న రాహుల్ నిర్ణయం పనిచేసింది. బ్యాట్స్‌మెన్ ఔట్ అయ్యాడని ఎవరూ అనుకోలేదు, కానీ కేఎల్ రాహుల్ తెలివితేటల వల్ల భారత్‌కు వికెట్ దక్కింది.
ఈ మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ.. కేఎల్ రాహుల్ డీఆర్‌ఎస్‌పై ప్రశంసలు కురిపించాడు. కేఎల్ రాహుల్ బాధ్యతాయుతమైన ఆటగాడని.. అవుటా.. లేదా.. అనే విషయాన్ని వికెట్ వెనుక నుండి అతను బ్యాట్స్‌మెన్‌ను బాగా పరీక్షించగలడని రోహిత్ చెప్పాడు. దీనిపై సరదాగా రోహిత్ మాట్లాడుతూ.. ఈరోజు నుంచి వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, బౌలర్లు.. తమ సమన్వయంతో డీఆర్‌ఎస్‌ను తీసుకోవచ్చు.. నేను నా ఇష్టానుసారం డీఆర్‌ఎస్‌ని డిమాండ్ చేయను అని వ్యాఖ్యానించాడు. బౌలర్, కేఎల్ రాహుల్ డీఆర్‌ఎస్ తీసుకోవాలని భావిస్తే డీఆర్‌ఎస్ తీసుకోవచ్చని నవ్వులు పూయించాడు.