దూసుకెళ్తున్న కరోనా: ప్రపంచవ్యాప్తంగా 65 లక్షల కేసులు
By సుభాష్ Published on 4 Jun 2020 10:34 AM ISTప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రస్థాయిలో పెరుగుతోంది. చైనాలో పుట్టిన వైరస్ అన్ని దేశాలకు చాపకింద నీరులా విస్తరించింది. ఇక తాజాగా ప్రపంచ వ్యాప్తంగా బుధవారం లక్షకుపైగా కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ కరోనా కేసుల సంఖ్య మొత్తం 65, 67,058కి చేరింది. ఇక బుధవారం 6వేల పైగా మృతులు నమోదు కావడంతో, మొత్త 387,899కి చేరింది. కాగా, ప్రస్తుతం 30,14,906 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్యశాఖ తెలిపింది.
అమెరికాలో మళ్లీ విజృంభణ:
కాగా, కరోనా వైరస్ అమెరికాలో తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఓ ఐదు రోజుల నుంచి కొత్త కేసుల, మరణాలు తగ్గుముఖం పట్టినా.. మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. బుధవారం ఒక్క రోజు 20వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 19,01,783కు చేరాయి. ఇప్పటి వరకూ 109142 మంది మరణించారు. బ్రెజిల్‌లో 558,237 కేసులు నమోదు కాగా, మృతుల సంఖ్య 31,309కి చేరింది. రష్యాలో 432,277 పాజిటివ్ కేసులు, మరణాలు 5,215,
ఇక భారత్‌లో ..
ఇక భారత్‌లో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తీవ్రంగానే ఉంది. బుధవారం భారత్‌లో 8909 కరోనా కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 2,07,615కు చేరుకుంది. 5815 మంది మృతి చెందగా, ప్రస్తుతం 101497 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకుని 100303 మంది డిశ్చార్జ్ అయ్యారు.