మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో ఎన్ని కేసులంటే..

By సుభాష్  Published on  4 Jun 2020 2:49 AM GMT
మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో ఎన్ని కేసులంటే..

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది. ఇక దేశంలోనే కరోనా కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. అక్కడ రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసులతో పాటు మరణాల సంఖ్య తీవ్రంగా ఉంది. మొత్తం మీద మహారాష్ట్రలో కరోనా తీవ్ర స్థాయిలో పంజా విసురుతుందనే చెప్పాలి. బుధవారం రాత్రి మహారాష్ట్ర సర్కార్‌ విడుదల హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో ఏకంగా 2,560 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇక 996 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ కాగా, 122 మంది మరణించారు. ఇప్పటి వరకూ మహారాష్ట్రంలో 74860 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటి వరకూ కరోనా నుంచి 32, 329 మంది కోలుకోగా, ఇప్పటి వరకూ కరోనా మరణాలు 2587 సంభవించాయి. ఇక ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 39,935 కేసులు యాక్టివ్‌లో ఉన్నాయి.

ఇక ప్రపంచ వ్యాప్తంగా కూడా తీవ్రంగానే ఉంది కరోనా. వివిధ దేశాల్లో లాక్‌డౌన్‌ కొనసాగించినప్పటికీ దీనిని నివారించడంలో విఫలం అవుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకూ 213 దేశాలకు ఈ వైరస్‌ పాకింది. తాజా సమాచారం ప్రకారం.. ఇప్పటి వరకూ 6,493,096 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 383,645 మంది మృత్యువాతపడ్డారు. ఇక 3,092,443 వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ కాగా, మరణాల సంఖ్య కూడా బాగానే ఉంది. ఇక అమెరికాలో మాత్రం తీవ్రంగా ఉంది. 1,884,966 కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య 108,196కు చేరుకుంది. ఇక బ్రెజిల్‌లో 558,237 కేసులు నమోదు కాగా, మృతుల సంఖ్య 31,309కి చేరింది. రష్యాలో 432,277 పాజిటివ్‌ కేసులు, మరణాలు 5,215, ఇక భారత్‌లో 211,770 కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య 5,892కి చేరింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు తీవ్రస్థాయిలో ఉండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే కరోనా అంతం కానట్లుగానే కనిపిస్తోంది.



Next Story