ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ప్రపంచంలోని దాదాపు
200లకుపైగా దేశాలకు చాపకింద నీరులా విస్తరించిన కరోనా వైరస్‌.. కంటిమీద కునుకు
లేకుండా చేస్తోంది. దేశాలన్నీ దశల వారీగా లాక్‌డౌన్‌ విధించినా.. లాభం లేకుండా పోతోంది.
రోజురోజుకు ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోతోంది.

తాజా సమాచారం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా కరోనా అప్‌డేట్స్‌:
24 గంటల్లో పాజిటివ్‌ కేసులు – 2,73,273
24 గంటల్లో మరణాలు – 6346
మొత్తం పాజిటివ్‌ కేసులు – 24,390,851
మొత్తం మరణాలు – 830,763
మొత్తం డిశ్చార్జ్‌ – 16,924,077

కాగా, మరణాల రేటు కంటే రికవరీ రేటు ఎక్కువగా ఉండటంతో ఊరట కలిగించే విషయమనే
చెప్పాలి.ఇక అమెరికా, బ్రెజిల్‌, రష్యా దేశాల్లో కరోనా తీవ్రంగా వ్యాపిస్తోంది. ప్రస్తుతం అన్ని దేశాలు
లాక్‌డౌన్‌ను దశల వారీగా సడలిస్తున్న నేపథ్యంలో ఈ వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉంది.

అత్యధికంగా కేసులు నమోదవుతున్న దేశాలు:
అమెరికాలో పాజిటివ్‌ కేసులు – 6,003,176, మరణాలు 183,689
బ్రెజిల్‌లో పాజిటివ్‌ కేసులు – 3,722,008, మరణాలు 117,758
రష్యాలో పాజిటివ్‌ కేసులు – 975,576, మరణాలు 16,804
భారత్‌లో పాజిటివ్‌ కేసులు 3,333,732, మరణాలు – 60,848

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *