కరోనాను అంతం చేసే మరో అస్త్రం..జపాన్‌ శాస్త్రవేత్తల గుడ్‌న్యూస్‌..!

By సుభాష్  Published on  27 Aug 2020 5:18 AM GMT
కరోనాను అంతం చేసే మరో అస్త్రం..జపాన్‌ శాస్త్రవేత్తల గుడ్‌న్యూస్‌..!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇక వైరస్‌ బారి నుంచి

కాపాడుకోవడానికి పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో జపాన్‌ శాస్త్రవేత్తలు ఓ

ఆసక్తికరమైన విషయం వెల్లడించారు. తక్కువ మోతాదు కలిగిన ఓ జోన్‌ గ్యాస్‌ కరోనా వైరస్‌

కణాలకు చెక్ పెట్టవచ్చని తెలిపారు. దీంతో ఆస్పత్రులు, పరీక్షా కేంద్రాలు వంటి

ముఖ్యమైన ప్రదేశాల్లో దీనిని ఉపయోగాంచాలని తెలిపారు. ఫుజిటా హెల్త్‌

యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఒక సమావేశంలో మాట్లాడుతూ.. ఓజోన్‌ వాయువు 0.05

నుంచి 0.1 పీపీఎం, మానవుల హాని చేయనిదిగా భావించే స్థాయి వైరస్‌ని చంపగలదని

గుర్తించామన్నారు.

ప్రయోగం ద్వారా నిరూపణ

ఈ ప్రయోగంలో వారు కరోనా వైరస్‌ నమూనా కలిగివున్న గదిలో ఓజోన్‌ జనరేటర్‌ను

ఉపయోగించారు. దాదాపు 10 గంటల పాటు తక్కువ మోతాదులో విడుదలయ్యే ఓజోన్‌ గ్యాస్‌ను ఉపయోగించడం వల్ల వైరస్‌ శక్తి 90శాతం మేర తగ్గినట్లు గుర్తించినట్లు ఆయన వివరించారు. అయితే ఇటువంటి విధానాన్ని ఆస్పత్రుల్లో, ఇతర ప్రాంతాల్లో ఉపయోగించడం వల్ల రోగులకు, ఇతరులకు ఎలాంటి హాని ఉండదని తెలిపారు.

కరోనా వైరస్‌ వ్యాప్తిని తగ్గించడం కోసం ప్రజలు ఉన్న వాతావరణంలో కూడా నిరంతరం, తక్కువ మోతాదు కలిగిన ఓజోన్‌ వాయువును పంపించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని, అధిక తేమతో కూడిన పరిస్థితుల్లో కూడా ఇది చాలా ప్రభావంతంగా ఉంటుందని గుర్తించామన్నారు.

ఓజోన్‌ ఒక రకమైన ఆక్సిజన్‌ అణువు

ఓజోన్‌ ఒక రకమైన ఆక్సిజన్‌ అణణువు. ఇది అనేక వ్యాధిరకాలను క్రియారహితం చేస్తుంది. 1-6 పీపీఎం మధ్య అధిక సాంద్రత గల ఓజోన్‌ వాయువు కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా పని చేస్తుందన్నారు. అయితే ఈ అధిక సాంద్రత మానవులకు విషపూరితమైనది.

అధ్యయనం ప్రకారం..

జార్జియా ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఇటీవల జరిపిన ఓ అధ్యయనం ప్రకారం.. మనం నిత్యం వాడే గౌన్లు, గాగుల్స్‌, ఇతర వైద్య రక్షణ పరికరాలను డిస్‌ఇన్‌ఫెక్టెంట్ చేయడంలో ఓజోన్‌ ప్రభావవంతంగా ఉంటుందని తేలింది. సెంట్రల్‌ జపాన్‌లోని ఐచి ప్రిఫెక్చర్‌లో పుజిటా మెడకల్‌ యూనివర్సిటీ ఆస్పత్రి, వెయింటింగ్‌ రూమ్‌లు, రోగుల గదుల్లో వైరస్‌ వ్యాప్తిని తగ్గించడానికి ఓజోన్‌ జనరేటర్లను ఏర్పాటు చేసింది. ఈ పరిశోధనలలో వైరస్‌ శక్తిని తగ్గించవచ్చని తేలింది. అధిక మోతాదులో ఓజోన్‌ వినియోగం ద్వారా కరోనాను అంతం చేయవచ్చని ఈ అధ్యయనంలో తేలింది. ఇంతటి స్థాయిలో ఓజోన్‌ మనుషులకు ప్రమాదకరమని అప్పట్లో శాస్త్రవేత్తలు తేల్చారు. అయితే తాజా అధ్యయనం మాత్రం మనుషులకు ఎలాంటి హానీ జరగకుండానే ఓజోన్‌ గ్యాస్‌ను కరోనాపై ఉపయోగించవచ్చని జపాన్‌ శాస్త్రవేత్తలు గురించారు.

Next Story