ప్రపంచ వ్యాప్తంగా కరోనా అప్‌డేట్స్‌: 8 లక్షలు దాటిన మరణాలు

By సుభాష్  Published on  27 Aug 2020 8:28 PM IST
ప్రపంచ వ్యాప్తంగా కరోనా అప్‌డేట్స్‌: 8 లక్షలు దాటిన మరణాలు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ప్రపంచంలోని దాదాపు

200లకుపైగా దేశాలకు చాపకింద నీరులా విస్తరించిన కరోనా వైరస్‌.. కంటిమీద కునుకు

లేకుండా చేస్తోంది. దేశాలన్నీ దశల వారీగా లాక్‌డౌన్‌ విధించినా.. లాభం లేకుండా పోతోంది.

రోజురోజుకు ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోతోంది.

తాజా సమాచారం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా కరోనా అప్‌డేట్స్‌:

24 గంటల్లో పాజిటివ్‌ కేసులు - 2,73,273

24 గంటల్లో మరణాలు - 6346

మొత్తం పాజిటివ్‌ కేసులు - 24,390,851

మొత్తం మరణాలు - 830,763

మొత్తం డిశ్చార్జ్‌ - 16,924,077

కాగా, మరణాల రేటు కంటే రికవరీ రేటు ఎక్కువగా ఉండటంతో ఊరట కలిగించే విషయమనే

చెప్పాలి.ఇక అమెరికా, బ్రెజిల్‌, రష్యా దేశాల్లో కరోనా తీవ్రంగా వ్యాపిస్తోంది. ప్రస్తుతం అన్ని దేశాలు

లాక్‌డౌన్‌ను దశల వారీగా సడలిస్తున్న నేపథ్యంలో ఈ వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉంది.

అత్యధికంగా కేసులు నమోదవుతున్న దేశాలు:

అమెరికాలో పాజిటివ్‌ కేసులు - 6,003,176, మరణాలు 183,689

బ్రెజిల్‌లో పాజిటివ్‌ కేసులు - 3,722,008, మరణాలు 117,758

రష్యాలో పాజిటివ్‌ కేసులు - 975,576, మరణాలు 16,804

భారత్‌లో పాజిటివ్‌ కేసులు 3,333,732, మరణాలు - 60,848

Next Story