గ్రామాలలో నిరసన తెలిపేందుకు వెళ్లిన కార్మికులు.. ఎందుకంటే?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Nov 2019 10:48 AM GMT
గ్రామాలలో నిరసన తెలిపేందుకు వెళ్లిన కార్మికులు.. ఎందుకంటే?

హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటితో 42వ రోజుకు చేరుకుంది. కాగా ఇన్ని రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్న ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందనలు రావడం లేదు. కుటుంబ పోషణ కోసం కార్మికులు కూలీ పనులకు వెళ్లాల్సి వస్తోంది. మరో వైపు ఆర్టీసీ జేఏసీ పిలుపుతో కార్మికులు గ్రామాలలో బైక్ ర్యాలీ చేపట్టేందుకు సిద్ధమయ్యారు. గ్రామాలలో బైక్‌ ర్యాలీ కార్యక్రమానికి హయత్‌నగర్‌ డిపో నుంచి ఆర్టీసీ కార్మికులు ర్యాలీగా బయల్దేరి వెళ్లారు. తమ ప్రధాన డిమాండ్లను నెరవేర్చాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story