రాణిగంజ్ ఆర్టీసీ డిపో దగ్గర కార్మికుల ధర్నా..అడ్డుకున్న పోలీసులు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Oct 2019 7:45 AM GMT
రాణిగంజ్ ఆర్టీసీ డిపో దగ్గర కార్మికుల ధర్నా..అడ్డుకున్న పోలీసులు

సికింద్రాబాద్: ఆర్టీసీ సమ్మెలో భాగంగా రాణిగంజ్ డిపో 1, 2 ముందు ఆర్టీసీ ఉద్యోగుల ధర్నాకు దిగారు. దీంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. కార్మికులు డిపో లోకి వెళ్లకుండా బారికేడ్స్..ముళ్ళకంచే ఏర్పాటు చేశారు. .శ్రీనివాస్ రెడ్డి..సురేందర్ గౌడ్ హమరహే అంటూ ఆర్టీసీ కార్మికులు నినదించారు. దాదాపుగా ఆర్టీసీ కార్మికులు అందరూ రోడ్లపైకి వచ్చే పరిస్థితి నెలకొంది. దీంతో పలు డిపోల దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.

చేసిన వాగ్దానాలను సీఎం కేసీఆర్ నిలబెట్టుకోలేదన్నారు ఆర్టీసీ కార్మికులు. ఆర్టీసీ కార్మికుల చావులకు కారణమైన సీఎం కేసీఆర్‌ను ప్రజలు క్షమించరన్నారు. పరిస్థితి ఇలా ఉంటే సీఎం కేసీఆర్ ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని ఆర్టీసీ కార్మికులు హెచ్చరించారు.

Next Story