భార్య‌భ‌ర్త‌ల బంధం పెంచుతున్న వ‌ర్క్ ఫ్రం హోం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Jun 2020 12:08 PM GMT
భార్య‌భ‌ర్త‌ల బంధం పెంచుతున్న వ‌ర్క్ ఫ్రం హోం

హైద‌రాబాద్‌: క‌రోనా క‌ల‌క‌లం నేప‌థ్యంలో దాదాపు మెజార్టీ సాఫ్ట్‌వేర్ కంపెనీలు అందుబాటులోకి తెచ్చిన‌ 'వ‌ర్క్ ఫ్రం హోం' విధానం అమ‌లుపై టెక్కీలు త‌మ అభిప్రాయాన్ని ఆస‌క్తిక‌రంగా పంచుకున్నారు. 'వ‌ర్క్ ఫ్రం హోం' వ‌ల్ల‌ భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య‌ బంధం పెరుగుతున్నట్లు తేలింది. గ‌తంలో విదేశాలంటే మోజు చూపించే టెక్కీలు ఇప్పుడు దేశంలోనే ఉండి ఉద్యోగం చేసుకునేందుకు ఆస‌క్తి చూపుతున్న‌ట్లు స్ప‌ష్ట‌మైంది. దాదాపు నెల రోజుల పాటుగా టీటా నిర్వ‌హిస్తున్న‌ స‌ర్వేలో మ‌రిన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి.

వ‌ర్క్ ఫ్రం హోం పెద్ద ఎత్తున సాగుతున్న నేప‌థ్యంలో 500 శాంపిల్ల యొక్క 150 ప్రాజెక్టులు టీటా ఆధ్వ‌ర్యంలో అధ్య‌య‌నం చేశారు. కొంద‌రిని వ్య‌క్తిగ‌తంగా, మ‌రికొంద‌రిని ఆన్‌లైన్‌లో, ఇంకొంద‌రిని స‌మాచారం పంచుకోవ‌డం రూపంలో సంప్ర‌దించి ఈ వివ‌రాలు సేక‌రించారు.

వ‌ర్క్ ఫ్రం హోం సాగుతున్న తీరు, దీన్ని కొన‌సాగిస్తే ఎలా అనే దానిపై అధ్య‌య‌నం జ‌రిగింది. నిమ్‌హ‌న్స్ రిపోర్ట్ ప్ర‌కారం అధికంగా విడాకులు ఉండే రంగం ఐటీ ప‌రిశ్ర‌మ కాగా, వ‌ర్క్ ఫ్రం హోం అమ‌లు స‌మ‌యంలో భాగస్వామితో అనుబంధం ఎలా ఉందనే ప్ర‌శ్న‌కు ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానం వ‌చ్చింది.

ఈ సర్వేలో టీటా అడిగిన ప్ర‌శ్న‌లు, వాటికి టెక్కీలు తెలిపిన స‌మాధానాలు ఈ విధంగా ఉన్నాయి..

ఆయా ప్ర‌శ్న‌లివి

1. వ‌ర్క్ ఫ్రం హోం కొన‌సాగిస్తే ఎంద‌రు దాన్ని ఇష్ట‌ప‌డ‌తారు? - 82.29%

2. వ‌ర్క్ ఫ్రం హోం కోసం మీ ఇంట్లో ప్ర‌త్యేక వ‌ర్క్ స్పేస్ ఉందా? - అవును - 62.5%

3. ఎక్క‌డి నుంచి వ‌ర్క్ ఫ్రం హోం చేశారు?

బెడ్ రూం - 44.79%

మెయిన్ హాల్ - 22.91%

లాన్ - 1.04%

ఆఫీసు స్పేస్ ‌- 23.96%

బాల్కానీ - 3.12

ఫ్లోర్- 4.17%

4. వ‌ర్క్ ఫ్రం హోం ఏ ప్రాంతం నుంచి చేశారు?

మెట్రో - 41.66%

అర్బ‌న్ ‌- 31.25%

రూర‌ల్ ‌- 21.87%

సెమీ అర్బ‌న్ - 5.20

5. వ‌ర్క్ ఫ్రం హోం కోసం ఇన్సెంటివ్ ప్ర‌క‌టించిన కంపెనీలు ఎన్ని ఉన్నాయి? - 8.33%

6. ఎన్ని గంట‌లు వ‌ర్క్ ఫ్రం హోంలో ప‌ని చేశారు.

1. 8hrs - 2.08%

2. 12hrs - 8.33%

3. 10-12hrs - 28.12%

4. 8-10hrs - 48.95%

5. 8hrs -12.5%

7. వ‌ర్క్ ఫ్రం హోంలో భాగస్వామితో అనుబంధం ఎలా ఉంది? - బాగుంది-88.54%

8. లాక్ డౌన్ సమయంలో ఇంటి నుంచి పని చేయడంలో మీరు ఒత్తిడికి లోనయ్యారా? - అవును -37.5%

9. వెంట‌నే ఆన్ సైట్ (ఇత‌ర దేశాల్లో ప‌ని అవ‌కాశం) క‌ల్పిస్తే ఎంత‌మంది ఆస‌క్తితో ఉన్నారు? - ఉన్నాం - 42.70%

ఈ స‌ర్వే గురించి టీటా గ్లోబ‌ల్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మ‌క్తాల మాట్లాడుతూ గ‌త నెల రోజులుగా టీటా ఆధ్వ‌ర్యంలో స‌ర్వే సాగుతోంద‌ని వెల్ల‌డించారు. వ్య‌క్తిగ‌తంగా, స‌ర్వే ఫారాల ద్వారా అభిప్రాయాలు తీసుకుంటున్నామ‌ని వెల్ల‌డించారు. వ‌ర్క్ ఫ్రం హోం విష‌యంలో టెక్కీలు త‌మ అభిప్రాలు పంచుకుంటూ మ‌రిన్ని స‌దుపాయాలు క‌ల్పిస్తే వ‌ర్క్ ఫ్రం చేసేందుకు త‌మ‌కు ఇబ్బందులు ఏవీ లేవ‌ని పేర్కొన్నారు. గ‌తంలో విదేశాల్లోని ప్రాజెక్టుల విష‌యంలో అత్యంత ఆస‌క్తి చూపే టెక్కీలు ఇప్పుడు మునుప‌టి ఆస‌క్తి చ‌ప‌డం లేద‌ని వెల్ల‌డించారు.

Next Story