'కాల్‌మనీ' కలకలం.. కోరిక తీర్చమంటూ..
By Medi Samrat Published on 19 Nov 2019 12:18 PM ISTముఖ్యాంశాలు
- 3 లక్షల అప్పు
- వడ్డీతో సహా 7లక్షలు చెల్లింపు
క్రైం న్యూస్ : గుంటూరు జిల్లాలో కాల్ మనీ కలకలం రేపుతుంది. వివరాళ్లోకెళితే.. నర్సరావుపేట మండలం బరంపేటకు చెందిన షేక్ అజీమున్నీసా అనే మహిళ ఎస్పీ కార్యాలయం వద్ద నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. అపస్మారక స్థితిలోకి చేరుకున్న బాధితురాలిని పోలీసు సిబ్బంది జీజీహెచ్ కు తరలించారు.
విషయం ఏమిటని ఆరాతీయగా.. రామిరెడ్డినగర్ కు చెందిన మాధవరావు, ప్రసాద్ అనే వ్యక్తుల వద్ద నుండి మూడు లక్షల రూపాయలను వడ్డీకి తీసుకున్నట్టు అజీమున్నీసా తెలిపింది. అయితే.. వడ్డీతో సహా ఏడున్నర లక్షల రూపాయలు చెల్లించినా ఇంకా చెల్లించాలని సదరు వ్యక్తులు వేధింపులకు పాల్పడుతున్నారని వాపోయింది. డబ్బులు ఇవ్వలేని పక్షంలో కోరిక తీర్చాలంటూ వత్తిడి తెస్తున్నారని కన్నీరుమున్నీరయింది.
అయితే.. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన పట్టించకోక పోవడంతో గతిలేక ఏస్పీ కార్యలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని సమాచారం. ప్రస్తుతం అజీమున్నీసా జీజీహెచ్ లో చికిత్స పొందుతుంది.