ఆ విషయంలో ఆడవాళ్లే గొప్ప..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Oct 2019 8:36 AM GMT
ఆ విషయంలో ఆడవాళ్లే గొప్ప..!

 • మగవాళ్లకంటే ఆడవాళ్లదే ఎక్కువ జీవితకాలం
 • ప్రపంచ సగటు ఆడవాళ్ల జీవితకాలం 74.2 ఏళ్లు
 • ప్రపంచ సగటు మగవారి జీవితకాలం 69. 8 ఏళ్లు
 • భారత్‌తో మహిళల జీవితకాలం 70.3 ఏళ్లు
 • భారత్‌లో పురుషుల జీవితకాలం 67. 4 ఏళ్లు
 • జపాన్‌లో మహిళల జీవిత కాలం 87.1 ఏళ్లు
 • జపాన్‌లో పురుషుల జీవితకాలం 82.1 ఏళ్లు
 • ఆదాయంలో అత్యధికం వైద్యానికే ఖర్చు చేస్తున్న ప్రపంచ ప్రజలు
 • ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక

ప్రపంచంలో చాలా రకాల సర్వేలు జరుగుతుంటాయి. కొన్ని చాలా విచిత్రంగా ఉంటాయి. కొన్ని నమ్మలేని నిజాలను బయట పెడుతుంటాయి.కొన్ని సర్వేలు చూస్తే ఔర అనిపిస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ మధ్య ఒక సర్వే చేసింది. ఆ సర్వేలో మగవాళ్ల కంటే ఆడవాళ్ల ఆయుర్ధాయమే ఎక్కువని తేలింది. ప్రపంచ ఆరోగ్య గణాంకాల నివేదిక -2019ను ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా విడుదల చేసింది. వివిద దేశాల్లో ప్రజల జీవిత కాలాన్ని విశ్లేషించింది. ప్రపంచంలో సరాసరి మహిళలు 74.2 ఏళ్లు జీవిస్తుంటే.. మగవారు 69.8 ఏళ్లు మాత్రమే బతుకుతున్నారు. అదనంగా మహిళలు బతికే 4.4 ఏళ్ల అదనపు కాలంలో ఒంటరితనం, వ్యాధుతోనే ఉంటున్నారని నివేదిక స్పష్టం చేసింది.

ఇక..భారత్‌లో చూసుకుంటే పురుషులు 67.4 ఏళ్లు బతుకుతుంటే.. మహిళలు. 70.3 ఏళ్లు బతుకుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక స్పష్టం చేసింది.అంటే భారత్‌లో మగవారి కంటే ఆడవారు 2.9 ఏళ్లు అధికంగా బతుకుతున్నారు. జపాన్‌లో ప్రపంచంలోనే అత్యధికంగా మహిళలు 87.1 ఏళ్లు, పురుషులు 81.1 ఏళ్లు జీవించగలుగుతున్నారు.

పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువుగా ఎలా జీవించగలగుతున్నారు..?!

దీనికి ఒకటి రెండు కాదు..40 కారణాలు ఉన్నాయంటుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక. ఈ 40 కారణాల్లో కూడా 33 అధికంగా దోహదం చేస్తాయని చెప్పింది. ఇక..తక్కువ ఆదాయం గల దేశాల్లో పుట్టిన వారి ఆయుర్దాయం కేవలం 62.7 ఏళ్లు, ఎక్కువ ఆదాయం గల దేశాల్లో పుట్టిన వారి ఆయుర్దాయం 80.8 ఏళ్లు. పేద, ధనికకు మధ్య తేడా 18.1 ఏళ్లు.

ఆదాయంలో ఆరోగ్యానికే అధిక ఖర్చు..!

 • ప్రపంచంలో చాలా మందికి అంటే సగం మందికిపైగా వైద్యం అందడంలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచంలో 80.80 కోట్ల మంది తమ ఇంటి ఖర్చులో 10శాతానికి పైగా వైద్యానికే ఖర్చు చేస్తున్నారు.
 • ఇండియాలో వైద్యానికి సగటున ఎంత ఖర్చు చేస్తున్నారు..?!
 • భారత్‌తో 17.3 శాతం మంది తమ ఇంటి ఖర్చులో 10శాతానికి పైగా వైద్యానికే ఖర్చు చేస్తున్నారు. 3.9 శాతం మంతి 25శాతానికి పైగా ఖర్చు చేస్తున్నారు.
 • ప్రతి 10వేల మంది జనాభాకు 7.8 మంది డాక్టర్లు ఉన్నారు. నర్సులు 21.1 మంది ఉన్నారు.
 • ప్రతీ లక్ష మందిలో 204 మందికి క్షయ వ్యాధి ఉంది
 • ప్రతీ వెయ్యి మందిలో 7.7 మందికి మలేరియా వచ్చే అవకాశముంది.

Next Story