Fact Check : ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భార్య సుధామూర్తి మఠంలో కూరయాగాలను పరిశీలిస్తూ కనిపించారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Sep 2020 12:24 PM GMT
Fact Check : ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భార్య సుధామూర్తి మఠంలో కూరయాగాలను పరిశీలిస్తూ కనిపించారా..?

ఇటీవల న్యూస్ మీటర్ కు ఓ ఫోటో అందింది. అందులో ఉన్న మహిళ ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భార్య సుధా మూర్తి అని చెప్పారు. కూరగాయలను ఓ ట్రేలో పెడుతున్న ఆ ఫోటోను బెంగళూరులోని జయానగర్ లోని శ్రీ రాఘవేంద్ర మఠంలోనిది అని తెలిపారు.

S1

ఆ ఫోటో కింద ఉన్న మెసేజీలో 'ఈ ఫోటోలో ఉన్నది మిసెస్ సుధా మూర్తీ, ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ ఎన్.ఆర్.నారాయణ మూర్తి భార్య, కొన్ని వందల కోట్లకు అధిపతులైనప్పటికీ వారు సాదా సీదా జీవనానికి అలవాటు పడ్డారు. తిరుమల వెంకటేశ్వర స్వామి కోసం ఆమె స్వయంగా పూలను కుడతారు.. ఇంకొన్ని సార్లు బెంగళూరులోని జయానగర్ లోని శ్రీ రాఘవేంద్ర మఠంలో ఆమె ప్రసాదం తయారు చేయడానికి స్వయంగా పూనుకుంటారు. మూడు రోజుల పాటూ అక్కడ ఉండి కాయగూరలను ఆమె తరుగుతూ ఉంటారు. డబ్బే సర్వసం అని ఆమె అనుకోరని.. మానవత్వాన్ని మించినది ఏదీ లేదని ఆమె నిరూపించారు. ఆమెకు నిజంగా సెల్యూట్' అని ఉంది.

సామాజిక మాధ్యమాల్లో కూడా ఇదే తరహా పోస్టులు కనిపించాయి.నిజ నిర్ధారణ:

ఆ ఫోటోలో ఉన్న మహిళ నిజంగా సుధామూర్తి గారే.. ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నారాయణ మూర్తి భార్య సుధామూర్తి ఆ ఫోటోలో ఉన్నది 'పచ్చి నిజం'.

ఈ ఫోటోకు సంబంధించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా సుధా మూర్తి రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాల్లో పాల్గొనడం నిజమే. ఆమె చాలా ఏళ్లుగా ఆరాధనోత్సవాల్లో పాల్గొంటూ ఉన్నారు. అందుకు సంబంధించిన పలు వార్తా కథనాలను చూడొచ్చు.

Bangalore Mirror లో అక్టోబర్ 2013న ఓ కథనాన్ని ప్రచురించారు. ఆమె ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటూ రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాల్లో పాల్గొంటారు. సుధామూర్తి ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేచి.. రాఘవేంద్ర స్వామి ఆలయానికి వెళ్లి సేవలో పాల్గొంటారు. ఆలయం లోని వంటగదిలోకి వెళ్లి ఆమె తన పనిలో నిమగ్నమవుతూ ఉంటారు. ఈ ఆలయం ఆమె ఇంటికి దగ్గరలోనే ఉంది.

ఆ తర్వాత కొన్ని గంటల పాటూ ఆమె వంటగదిని శుభ్రం చేస్తూ గడుపుతారు. పాత్రలను కడుగుతూ.. అరలను శుభ్రం చేస్తూ.. కాయగూరలను కట్ చేయడమే కాకుండా.. వరండాను శుభ్రపరుస్తూ ఉంటారు. పెద్ద పెద్ద వస్తువులను దింపుకోడానికి మాత్రమే ఆమె ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటారు. తన పని పూర్తయ్యాక 9 గంటల సమయంలో తన ఇంటికి వెళుతూ ఉంటారు.

డబ్బులు ఇచ్చేయడం చాలా సులువు.. ఎందుకంటే అలా ఇచ్చేస్తే అలా అయిపోతుంది. కానీ మన శరీరాన్ని వంచి సేవ చేయడం మరో రకమైన సంతృప్తిని ఇస్తుందని ఆమె మీడియాకు తెలిపారు. ఢిల్లీ లోని గురుద్వారాలో కూడా ఆమె సేవ చేస్తూ ఉండేవారు. భక్తుల చెప్పులను ఆమె తీసుకుంటూ సేవలో భాగమయ్యే వారు.

Oneindia.com కన్నడ ఎడిషన్ లో కూడా ఆమె పాల్గొనే సేవా కార్యక్రమాల గురించి వివరించారు. పలు దేవాలయాలకు హాజరవ్వడమే కాకుండా అక్కడ పలు సేవల్లో ఆమె భాగమయ్యేవారు. మఠం అధికారుల ప్రకారం ఆమె మూడు రోజుల పాటూ స్టోర్ మేనేజర్ గా సేవలు అందిస్తారు.

సాక్షి టీవీ యుట్యూబ్ ఛానల్ లో సుధామూర్తి కాయగూరలను అమ్ముతున్నారంటూ తెలిపారు. కానీ అందులో నిజం లేదు. ఆమె ఆరాధనోత్సవాల్లో భాగంగా కూరగాయలను ఒక చోట పేర్చుతూ ఉన్నారు.

ఇటీవలే సుధామూర్తి బాగల్ కోట్ లోని వీక్లీ మార్కెట్ కు తమ బంధువుతో కలిసి హాజరయ్యారని పలు న్యూస్ వెబ్సైట్లు తెలిపాయి. ఆమె స్థానిక వర్తకుల దగ్గర నుండి కొనుక్కున్నారు.

డబ్బు ఒక్కటే శాశ్వతం కాదని.. వాటికి విలువ ఇవ్వకుండా మానవత్వానికి విలువ ఇవ్వాలని సుధామూర్తి పలుమార్లు రుజువు చేసింది. డబ్బు మనిషిలో మార్పులు తీసుకు రాలేదని ఆమె నిరూపించారు.

వైరల్ అవుతున్న పోస్టులు నిజమే. మఠంలో ఆమె సేవలు చేస్తూ ఉండడం నిజమేనని స్పష్టమవుతోంది.

Next Story