కులాంతర వివాహం..చెల్లెలింటికి వెళ్లొస్తానని చెప్పి

By రాణి  Published on  22 April 2020 10:32 AM GMT
కులాంతర వివాహం..చెల్లెలింటికి వెళ్లొస్తానని చెప్పి

వృత్తి రీత్యా అతనొక లాయర్. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మూడు నెలలు కాపురం చేశాక భార్యను కులం పేరుతో దూషించడం మొదలు పెట్టాడు. చెల్లెలి దగ్గరకు వెళ్లొస్తా అని చెప్పి ఈనెల 13వ తేదీన ఇంటి నుంచి వెళ్లిన అతను ఎంతకూ తిరిగి రాకపోయేసరికి ఆ మహిళ భర్తకోసం అత్తింటికి వెళ్లింది. అత్త, మామ ఆమె పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఆమె పై పిడి గుద్దులు గుద్దుతూ కాళ్లు, చేతులు పట్టుకుని బయటికి విసిరేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఖాగజ్ గట్ గ్రామంలో చోటుచేసుకుంది.

Also Read : శరీర బరువుని తగ్గించే పచ్చిమామిడి..ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

వివరాల్లోకి వెళ్తే..ఒకే గ్రామానికి చెందిన దూసరి వెంకటేష్ గౌడ్, కందుకూరి అరుణ కొద్ది సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. జనవరి 29వ తేదీన గొడకండ్లలో ఉన్న వెంకటేశ్వరస్వామి దేవాలయంలో పెద్దల ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లై మూడు నెలలైనా కాకుండానే వెంకటేష్ అరుణను వదిలేసి తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయాడు. చెల్లెలింటికి వెళ్లొస్తానని ఈ నెల 13వ తేదీన వెళ్లిన వెంకటేష్ ఎంతకూ తిరిగి ఇంటికి రాకపోవడంతో భార్య అరుణ కాగజ్ ఘట్ లోని అత్తింటికి వెళ్లింది. తన భర్త కోసం వెళ్లిన అరుణపై అత్తింటివారు దౌర్జన్యానికి ఒడిగట్టారు. ఇష్టమొచ్చినట్లు కొట్టి, బట్టలు చింపేసి బయటికి పంపేశారు. దీంతో అరుణ అత్తింటి ఎదుటే బైఠాయించి తనకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టింది.

Also Read : ప్రియుడితో రొమాన్స్‌.. అడ్డుగా ఉన్నాడ‌ని కొడుకును చంపిన త‌ల్లి

Woman Fights For Her Husband 2

ప్రేమించి పెళ్లి చేసుకునేటపుడు గుర్తురాని కులం, నాతో మూడు నెలలు కాపురం చేశాక గుర్తొచ్చిందా ? పెళ్లినాడు మా అమ్మవాళ్లను ఒప్పిస్తానన్నాడు. ఇప్పుడు కోపంగా ఉన్నారు. అయినా నీకు అన్నీ నేనై చూసుకుంటానన్నాడు. తల్లిదండ్రులు లేని అమ్మాయివి నిన్ను చేసుకుంటాను. అని నమ్మబలికి ఇప్పుడు మోసం చేశాడంటూ వాపోతోంది అరుణ. నా భర్త నాకు కావాలి. చచ్చేంత వరకూ తనతోనే నా జీవితం అంటూ బావురమంది. తనకు న్యాయం చేయాల్సిందిగా మహిళా సంఘాలను కోరింది. ఏదేమైనా న్యాయపరమైన వృత్తిలో ఉన్న వాడే కులం పేరుతో మహిళకు అన్యాయం చేయడంపై విమర్శలొస్తున్నాయి. అరుణ భర్త వెంకటేష్ ఇబ్రహీంపట్నం కోర్టులో అడ్వకేట్ గా పనిచేస్తున్నాడు.

Also Read :జియోలో 9.99 శాతం వాటా సొంతం చేసుకున్న ఫేస్‌బుక్‌

Next Story