శరీర బరువుని తగ్గించే పచ్చిమామిడి..ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

By రాణి  Published on  22 April 2020 7:44 AM GMT
శరీర బరువుని తగ్గించే పచ్చిమామిడి..ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

వేసవి అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేవి మామిడి కాయలు. ఉగాది తర్వాత మార్కెట్లోకి వస్తాయి. వీటిలో చాలా రకాలు ఉంటాయి. పచ్చడి మామిడి, పచ్చి మామిడి, కొబ్బరి మామిడి, రసాలు, పళ్లు ఇలా రకరకాలైన మామిడికాయలు మార్కెట్లోకి వస్తుంటాయి. ముఖ్యంగా బంగినపల్లి మామిడంటే ఇష్టపడనివారుండరనుకోండి. ఆ మామిడికి ఉండే రుచే వేరు. అలాగే వేసవిలో వచ్చే పచ్చిమామిడి ముక్కలపై ఉప్పు, కారం చల్లుకుని తినేప్రియులూ ఉంటారు. పచ్చిమామిడి తింటే ఎలాంటి ఉపయోగాలుంటాయి.. అలాగే మామిడి పండ్లు తినడం వల్ల చేకూరో ఆరోగ్య ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం.

- శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మామిడి కాయ. బరువు తగ్గాలనుకునేవారు పచ్చిమామిడి తినడం వల్ల శరీరంలో ఉన్న చెడు కొవ్వులు తొలగిపోతాయి. అంతేకాకుండా జీర్ణశక్తి మెరుగై మలబద్ధక సమస్యను దూరం చేస్తుంది.

- అసిడిటి, గుండెల్లో మంట వంటి సమస్యలను పచ్చిమామిడి నివారిస్తుంది. రోజూ ఒక పచ్చిమామిడి తినడం వల్ల అసిడిటి, కడుపులో మంట సమస్యలు తగ్గడంతో పాటు కడుపు ఉబ్బరం కూడా పోయి ఆరోగ్యంగా ఉంటారు.

- లివర్ పై కూడా పచ్చిమామిడి బాగా పనిచేస్తుంది. మామిడిలో ఉండే ఆమ్లాలు లివర్ సమస్యను తగ్గించడంతో పాటు అక్కడుండే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను రూపుమాపుతుంది.

- వేసవిలో ఎండ ఎక్కువగా ఉంటుంది. ఎండలో తిరగడం వల్ల శరీరం సోడియం, ఐరన్ వంటి ఖనిజాలను కోల్పోతుంది. వాటిని తిరిగి పొందాలంటే పచ్చిమామిడిని తినడం లేదా ఇంట్లోనే మామిడి జ్యూస్ ను తాగాలి. కోల్పోయిన ఖనిజాలను తిరిగివ్వడమే కాకుండా తక్షణ శక్తిని కూడా అందిస్తుంది.

- షుగర్ వ్యాధిగ్రస్తులకు పచ్చిమామిడి ఓ వరం. వేసవిలో వచ్చే ఈ పచ్చిమామిడిని తినడం వల్ల రక్తంలో అధికంగా ఉన్న షుగర్ లెవల్ ను క్రమబద్దీకరిస్తుంి. అలాగే రక్తాన్ని శుద్ధి చేసి రక్తకణాల వృద్ధికి తోడ్పడుతుంది.

- దంత సమస్యలకు కూడా మామిడి బాగా పనిచేస్తుంది. పచ్చిమామిడిని బాగా నమిలి తినడం వల్ల చిగుళ్లు గట్టి పడుతాయి. చిగుళ్ల నుంచి తరచూ రక్తం కారే సమస్యతో ఉన్నవారికి పచ్చిమామిడి చక్కటి పరిష్కారం చూపుతుంది. నోటి దుర్వాసన సమస్యలను కూడా తగ్గిస్తుంది.

- గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా పచ్చిమామిడి ముఖ్యపాత్ర పోషిస్తుంది. పగటిపూట నిద్రబాగా వచ్చేవారి భోజనం తర్వాత ఓ ముక్క తినడం వల్ల నిద్ర పోతుంది.

Next Story