కారులోనే బలవంతంగా యువతికి తాళి కట్టాడు

 Published on  6 Feb 2020 8:31 AM GMT
కారులోనే బలవంతంగా యువతికి తాళి కట్టాడు

కర్ణాటకలోని హసన్‌ జిల్లాలో అనూహ్య ఘటన జరిగింది. ఓ యువతి బస్సు కోసం ఎదురుచూస్తుండగా.. కొందరు యువకులు కారులో అక్కడికి వచ్చారు. ఆయువతిని బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. అనంతరం వారిలోని ఓ యువకుడు ఆమెకు బలవంతంగా తాళి కట్టాడు. కాగా తాళి కట్టిన వ్యక్తి యువతికి బావ వరుస అవుతాడు. యువతి తనతో వివాహానికి నిరాకరించిందన్న ఆగ్రహాంతో బావ మను ఆమెను అపహరించాడు.

యువతి తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, వద్దని ఎంత బతిమిలాడినా ప్రమోజనం లేకపోయింది. బలవంతంగా యువతి మెడలో తాళి కట్టాడు. మనుకి మరో ఇద్దరు సహకరించినట్టు తెలుస్తోంది. ఈ ఘటన మొత్తాన్ని వీడియో తీసి.. సోషల్ మీడియాలో అప్‌ లోడ్ చేశారు. ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. యువతిని మను తన స్నేహితుడి వద్ద దాచినట్లు ఆరోపించారు. మనుకుమార్ కదిలే కారులో మంగళసూత్రాన్ని మెడలో బలవంతంగా కట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నిందితులను గుర్తించిన పోలీసులు రామనగర జిల్లాలోని బెవురులో అరెస్ట్ చేశారు. ఈ కేసులో మనుకుమార్ స్నేహితులు ప్రవీన్ కుమార్(23), వినయ్ టిఎన్ (25)ను అరెస్టు చేశారు. సందీప్ కెఎ(26), కారు డ్రైవర్ గాంధీ పరారీలో ఉన్నారు.

Next Story
Share it