బాలికపై వ్యాన్ డ్రైవర్ అఘాయిత్యం..
By Newsmeter.Network Published on 6 Feb 2020 2:40 PM IST
ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక పై స్కూల్ వ్యాన్ డ్రైవర్ కన్నేశాడు. ఆ బాలికకు మాయమాటలు చెప్పి అత్మాచారానికి యత్నించాడు. భయపడిన బాలిక గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి ఆ కామాంధుడి బారి నుంచి ఆ బాలికను రక్షించారు.
ఈ దారుణ ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఓ పాఠశాలలో బాలిక ఎనిమిద తరగతి చదువుతోంది. నిత్యం పాఠశాలకు.. స్కూల్ వ్యాన్ లోనే వెళ్లేది. ఈ క్రమంలో ఆ బాలిక పై కన్నేశాడు ఆ వ్యాన్ డ్రైవర్. గురువారం బాలికకు మాయమాటలు చెప్పి దీన్‌దయాళ్ నగర్‌లోని శ్మశానానికి తీసుకెళ్లి అత్యాచారం చేయబోయాడు.
కంగారుపడిన బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి రక్షించారు. ఆగ్రహించిన స్థానికులు నిందితుడు శివను చితకబాది.. అతను తీసుకువచ్చిన స్కూల్ వ్యాన్ కు నిప్పంటించారు. పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. విద్యార్థిని తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికులతో కలిసి ఆందోళన చేపట్టారు. బిడ్డపై వ్యాన్ డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడటంపై స్కూల్ యాజమాన్యం సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు.