ఈమెకి నెటిజెన్లు జోహార్ అంటున్నారు.. ఏమి చేసిందో చూడండి
By సత్య ప్రియ Published on 19 Oct 2019 11:27 AM GMTవిమానం ఎక్కాలంటే ఎన్నో రూల్స్ వుంటాయి. ఎక్కువగా లగేజ్ తీసుకెళ్లకూడడు, చిన్న చాకులూ, కట్టర్లూ మనతో తీసుకెళ్లకూడదు... ఇలాంటివి మరెన్నో ఉన్నాయి. అలా చేయకపోతే సిబ్బంది మనల్ని విమానం ఎక్కడం కాదు కదా గేటు దాటనీయరు.
నిర్ణీత పరిమితి కంటే లగేజ్ ఎక్కువ ఉంటే విమాన సిబ్బంది వారు అస్సలు ఒప్పుకోరు. ఇలాంటి సమస్య మనలో చాలామంది ఎదుర్కొనే వుంటారు. అప్పడీకప్పుడు కంగారు పడుతూ లగేజ్ ని తొలగించడమో లేక అయ్యో అనుకుంటూ అధిక డబ్బులు కట్టి తెచ్చుకుంటాం.
అయితే, కొంతమంది ఈ సమస్యని తమ చాకచక్యం, సమయస్పూర్తితో దాటేస్తారు. ఈ కోవకే చెందుతుంది గేల్ రొడ్రిగ్రేజ్ అనే ఫిలిప్పీన్స్ యువతి. ఇటీవల ఫిలిప్పీన్స్ నుంచి వేరే ప్రదేశానికి వెల్తుండగా, చెక్ ఇన్ వద్ద ఏయిర్ లైన్ సిబ్బంది ఆమె ను పరిశీలిసంచారు. అందులో మోతాదుకి మించి లగేజ్ వుందనీ, దానిని వారు అనుమతించలేమనీ చెప్పారట.
అది తీసుకువెళ్లాలంటే ఫైన్ కట్టాలని చెప్పారు. అయితే, గేల్ దగ్గర అంత డబ్బు లేదు. లగేజ్ లో నుంచి దుస్తులు తీసేసే ఉద్దేశ్యమూ లేదు. అందుకని ఆమె ఒకటి తరువాత ఒకటి సుమారు 2.5 కేజీల బరువు గల దుస్తులు వేసేసుకుంది. దీనితో, ఆమె లగేజి 6.5కేజీలకి దిగిపోయింది.
అంతటితో ఆమె ఆగలేదు, అన్ని దుస్తులు ధరించిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. “ఎయిర్‌పోర్ట్ సిబ్బంది 7కేజీలకు మించి లగేజ్‌ను తీసుకెళ్లకూడదన్నారు. వెంటనే నా 9కేజీల బరువును 6.5కేజీలకు ఇలా తగ్గించేశాను” అంటూ కామెంట్ పెట్టింది.
ఆమె పోస్ట్ వైరల్ గా మారింది. నెటిజెన్లు ఆమె చెసిన పని చూసి 'ఔరా ' అంటున్నారు, ఆమె తెలివిని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు.