అతను 15 ఏళ్ల వయసులో గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించడం గొప్ప విషయం
By Newsmeter.Network Published on 3 Dec 2019 4:30 PM IST15 ఏళ్ల వయసులో గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించడం గొప్ప విషయం అని హీరో వెంకటేష్ ఎవరి గురించి చెప్పారనుకుంటున్నారా..? మిస్ మ్యాచ్ సినిమాలో హీరోగా నటించిన ఉదయ్ శంకర్ గురించి. ఎన్.వి. నిర్మల్ దర్శకత్వలో రూపొందిన చిత్రం మిస్ మ్యాచ్. డిసెంబర్ 6న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు తెలంగాణ ఆర్థిక శాఖా మంత్రి హరీశ్‌రావు, స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా హీరో వెంకటేష్ పైన చెప్పిన విధంగా స్పందించి. హీరో ఉదయ్ శంకర్ గురించి ఎవరికీ తెలియని విషయాన్ని బయటపెట్టారు. ఇంతకీ ఏ విషయంలో గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించడంటే... జ్ఞాపకశక్తి విషయంలో అట. వెంకీ ఇంకా ఏం చెప్పారంటే.. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక ఆర్టిస్ట్, టెక్నీషియన్ నా హృదయానికి ఎంతో దగ్గరైనవారని... వారందరికీ ఆల్ ది బెస్ట్. ఉదయ్‌శంకర్ గురించి చెప్పాలంటే తన తొలి చిత్రం ఆటగదరా శివలో అద్భతుంగా నటించాడు. ఇప్పుడు ‘మిస్ మ్యాచ్’లో మరో అద్భుతమైన పాత్రలో నటించాడు అన్నారు.
తన రియల్ లైఫ్ క్యారెక్టర్‌కి దగ్గరైన పాత్ర. తను 15ఏళ్ల వయసులో గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించడం గొప్ప విషయం. తను హీరోగా చేసిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలి. ఐశ్వర్యారాజేష్ మరో అద్భుతమైన పాత్రలో నటించింది. తనకు కూడా అభినందనలు. నిర్మాతలు భరత్, శ్రీరామ్‌కు అభినందనలు. భూపతిరాజాగారు వండర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను అందించారని అర్థమవుతుంది. అమ్మాయిలు ఉన్నతస్థాయికి ఎదిగే స్క్రిప్ట్స్‌ను నేను బాగా ఇష్టపడతాను అని చెప్పారు.