ఆకాశంలో అద్భుత విన్యాసాలు.. సామాన్యులకు నో ఎంట్రీ

By అంజి  Published on  12 March 2020 5:39 AM GMT
ఆకాశంలో అద్భుత విన్యాసాలు.. సామాన్యులకు నో ఎంట్రీ

ముఖ్యాంశాలు

  • వింగ్స్‌ ఇండియా-2020
  • నాలుగు రోజుల పాటు విన్యాసాలు
  • కార్యక్రమంలో పాలుపంచుకోనున్న ఇంటర్నేషనల్‌ కంపెనీలు

హైదరాబాద్‌: బేగంపేట ఎయిర్‌పోర్టులో ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు వింగ్‌ ఇండియా-2020 పేరుతో ఎయిర్‌ షో నిర్వహించనున్నారు. కాగా నేటి నుంచి రెండు రోజుల పాటు వ్యాపార సందర్శకులకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా సామాన్య ప్రజలకు అనుమతి నిరాకరించినట్లు తెలిసింది. ఆక్రోబాట్‌ హెలికాప్టర్ల విన్యాసాలు గగనతలంలో సందర్శకులను కనువిందు చేయనున్నాయి.

ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ, కేంద్ర పౌర విమానయాన సంస్థ, ఎయిర్‌పోర్ట్స్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ప్రతి రెండేళ్లకొకసారి వింగ్స్‌ ఇండియా పేరిట నిర్వహించే ఈ కార్యక్రమానికి ఈసారి బేగంపేట ఎయిర్‌పోర్టు ముస్తాబైంది.

Wings india 2020

సరంగ్‌ టీమ్, మార్క్‌ జెఫ్రీ టీమ్‌ల విన్యాసాలు హైలెట్‌గా నిలవనున్నాయి. ఎయిర్‌షోకు నిర్వహకులు అధిక ప్రాధాన్యత కల్పించారు. హెలికాప్టర్‌, ఎయిర్‌క్రాఫ్ట్‌ తయారీ కంపెనీల ఉత్పత్తులను ఎగ్జిబిషన్‌లో ఉంచనున్నారు.

Also Read: ఆర్మీ జనరల్‌కు కరోనా వైరస్‌

ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ మంత్ఇర కేటీఆర్‌ పాల్గొననున్నారు. ఎయిర్‌బస్‌, బోయింగ్‌, ఎఫ్‌ఎస్‌టీసీ తదితర ఇంటర్నేషనల్‌ కంపెనీలు ఇందులో పాలుపంచుకోనున్నాయి.

గతంలో ఉదయం, సాయంత్రం సమయంలో 20 నిమిషాలు మాత్రమే విన్యాసాలు చేసేవారు. అయితే ఈసారి విన్యాసాల సమయాన్ని గంటకు పొడిగించారు.

Next Story