ఆర్మీ జనరల్‌కు కరోనా వైరస్‌

By సుభాష్  Published on  11 March 2020 3:47 PM GMT
ఆర్మీ జనరల్‌కు కరోనా వైరస్‌

కొవిడ్ 19 (కరోనా వైరస్) ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కరోనా కారణంగా ఇప్పటికే 4వేలకు పైగా మృతి చెందగా, లక్షకుపైగా చికిత్స పొందుతున్నారు. కాగా, పోలాండ్‌ భద్రతా దళాలకు చెందిన ఆర్మీ జనరల్‌ జారొస్లావ్‌ మికా కరోనా బారిన పడ్డారు. ఆయనకు ఇటీవల జరిపిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది. జర్మనీలో జరిగిన మిలటరీ కాన్ఫరెన్స్‌లో పాల్గొని పొలాండ్‌కు తిరిగి వచ్చాక తీవ్ర జ్వరంతో బాధపడగా, వెంటనే ఆయన పరీక్షలు నిర్వహించగా, కరోనా వచ్చినట్లు తేలిందని ఆ దేశ రక్షణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. మార్చి 6న జర్మనీలో జరిగిన డిఫెండర్‌ యూరోప్‌ -20 కాన్ఫరెన్స్‌ లో మికా పాల్గొన్నారు. మరో వైపు ఇదే కాన్ఫరెన్స్‌ పాల్గొన్న అమెరికా యూరఫ్‌ ఆర్మీ కమాండర్‌ కూడా హాజరు కావడంతో పరిస్థితులను మరింతగా పరిశీలిస్తోంది.

చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా వందకుపైగా దేశాల్లో 1,13,000 మందికి సోకింది. దీనివల్ల 4వేల మందికిపైగా మరణించారు. భారత్ తోపాటు ఖతార్, యూకే, దక్షిణ కొరియా తదితర దేశాలు చైనా నుంచి పర్యాటకుల రాకను నిషేధించింది. పలు దేశాలు తమ దేశ పౌరులు చైనాలో పర్యటించవద్దని ఆదేశించాయి. అయితే అక్కడి ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ఆస్పత్రులు నిర్మించి, కట్టుదిట్టంగా వ్యవహరిస్తుండడంతో కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.

Next Story